సంవత్సరం పొడవునా మనకు దొరికే కూరగాయలలో వంకాయలు కూడా ఒకటి. వంకాయలు వేర్వేరు రంగులలో వేర్వేరు ఆకారాలలో లభ్యమవుతాయి. ప్రాంతాలను బట్టి వేర్వేరు రకాల వంకాయలను రైతులు సాగు చేస్తూ ఉంటారు. వంకాయ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో వంకాయ సహాయపడుతుంది. కొవ్వు, కొలెస్ట్రాల్, సోడియం పుష్కలంగా ఉండే వంకాయ గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
Also Read: చలికాలం పెరుగు తినకూడదా..? సైన్స్ ఏం చెబుతోందంటే..?
వంకాయలో ఉండే బీ విటమిన్లు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. శరీరంలోని ఐరన్ లెవెల్స్ ను బ్యాలన్స్ చేయడంతో వంకాయ ఉపయోగపడుతుంది. తక్కువ కేలరీలు ఉన్న వంకాయను తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. వంకాయలలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో వంకాయలు సహాయపడతాయి.
Also Read: అలాంటి టూత్ పేస్ట్, సబ్బులు వాడుతున్నారా.. ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్..?
జుట్టును ఆరోగ్యంగా, బలంగా ఉంచడంలో వంకాయలు సహాయపడతాయి. కఫం సమస్యతో బాధ పడే వాళ్లు వంకాయను నిప్పుపై కాల్చి ఉప్పుకారంతో తింటే ఆ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు. నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టడంలో వంకాయ సహాయపడుతుంది. అయితే వంకాయను ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్న సమయంలో అస్సలు తినకూడదు. వంకాయ శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది కాబట్టి జ్వరంతో బాధ పడే వాళ్లు వంకాయకు దూరంగా ఉంటే మంచిది.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
షుగర్ సమస్యతో బాధ పడేవాళ్లు వంకాయను తినకుండా ఉంటే మంచిది. వంకాయ షుగర్ లెవెల్స్ పెరగడానికి కారణమవుతుంది. ఎలర్జీ సమస్యతో బాధ పడే వాళ్లు వంకాయను ఎక్కువగా తీసుకోకూడదు. రక్తపోటు సమస్యతో బాధ పడే వాళ్లు వంకాయకు దూరంగా ఉంటే మంచిది.