https://oktelugu.com/

వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. అతి త్వరలో ఆరోగ్య బీమా పాలసీ..?

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లకు మరో శుభవార్త చెప్పింది. గత కొన్ని నెలల నుంచి కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ యూజర్లకు మరింత చేరువవుతున్న వాట్సాప్ త్వరలో ఆరోగ్య బీమా పాలసీలను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లకు మరింత చేరువ కావచ్చని వాట్సాప్ భావిస్తోంది. వచ్చే ఏడాది యాప్ సేవలను మరింత విస్తరించడానికి వాట్సాప్ సిద్ధమవుతోంది. Also Read: సింగర్ సునీత ప్రీ వెడ్డింగ్ పార్టీలో హోస్ట్ గా హీరో ? […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 21, 2020 / 09:08 AM IST
    Follow us on


    ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లకు మరో శుభవార్త చెప్పింది. గత కొన్ని నెలల నుంచి కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ యూజర్లకు మరింత చేరువవుతున్న వాట్సాప్ త్వరలో ఆరోగ్య బీమా పాలసీలను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లకు మరింత చేరువ కావచ్చని వాట్సాప్ భావిస్తోంది. వచ్చే ఏడాది యాప్ సేవలను మరింత విస్తరించడానికి వాట్సాప్ సిద్ధమవుతోంది.

    Also Read: సింగర్ సునీత ప్రీ వెడ్డింగ్ పార్టీలో హోస్ట్ గా హీరో ?

    ప్రముఖ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలతో జత కట్టి వాట్సాప్ ఈ సర్వీసులను అందిస్తోంది. ఆరోగ్య్ బీమా సర్వీసులను, మైక్రో ఫైనాన్స్ సర్వీసులను అందించడానికి వాట్సాప్ సిద్ధమవుతోంది. ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ తో జతకట్టి వాట్సాప్ ఈ సర్వీసులను అందిస్తోంది. పిన్‌బాక్స్‌ సొల్యూషన్స్‌, హెచ్డీఎఫ్సీ పెన్షన్లతో కలిసి వాట్సాప్ పెన్షన్ సర్వీసులను సైతం అందించడానికి సిద్ధమవుతోంది.

    Also Read: డోంట్ మిస్.. నేడు ఆకాశంలో అద్భుతం..!

    వాట్సాప్ ఇండియా దేశంలో 30 కోట్ల మందికి పెన్షన్ సదుపాయాన్ని కల్పించే ప్రయత్నాలు చేస్తోందని రోజుకు 50 రూపాయల కంటే తక్కువగా ఆదాయం సంపాదిస్తున్న వారికి ప్రయోజనం చేకూర్చే దిశగా వాట్సాప్ అడుగులు వేస్తోందని సమాచారం. ఇప్పటికే వాట్సాప్ పేమెంట్ సర్వీసుల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులతో జత కట్టగా త్వరలో బీమా సర్వీసులను కూడా వాట్సాప్ అందించబోతూ ఉండటం గమనార్హం.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    ఇండియా వాట్సాప్ ప్రతినిధి అభిజిత్ బోస్ జాతీయ పెన్షన్ యాప్ సహాయంతో పెన్షన్ సేవలను అందిస్తామని వెల్లడించారు. వాట్సాప్ కొత్త కొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తూ ఉండటంపై యూజర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాట్సాప్ అందిస్తున్న సర్వీసుల వల్ల యూజర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని తెలుస్తోంది.