ఆకాశంలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఆ అద్భుతాలు జరుగుతాయని తెలిసినా కొన్నింటిని మనం చూసే అవకాశం ఉండదు. అయితే కొన్ని అద్భుతాలను మాత్రం మనం చూసే అవకాశం ఉంటుంది. అలా నేడు ఆకాశంలో ఒక అద్భుతం చోటు చేసుకోనుంది. దాదాపు 4 శతాబ్దాల తర్వాత చోటు చేసుకోనున్న ఈ ఘట్టాన్ని కంటితో చూసే అవకాశం ఉంటుంది. ఈరోజు రాత్రి గురు, శని గ్రహాలు ఒకదానికొకటి సమీపంలో కనిపిస్తాయి.
Also Read: విజృంభిస్తున్న మరో రకం కరోనా.. యూరోప్ విమాన ప్రయాణ ఆంక్షలు
మిగతా గ్రహాలు ఒకదానికొకటి దగ్గరగా సాధారణంగా కనిపిస్తాయి. కానీ గురు, శని గ్రహాలు ఒకదానికొకటి దగ్గరగా రావడం అరుదుగా మాత్రమే జరుగుతుంది. ఖగోళ శాస్త్రవేత్తలు రెండు గ్రహాల కలయికను కంజక్షన్ అని పిలుస్తాయని అయితే గురుడు, శని గ్రహాల కలయికను మాత్రం గ్రేట్ కంజక్షన్ అని పిలుస్తామని వెల్లడించారు. 1623వ సంవత్సరంలో చివరగా ఈ రెండు గ్రహాలు దగ్గరగా వచ్చాయి.
Also Read: నిరుద్యోగులకు బ్యాంక్ ఆఫ్ బరోడా గుడ్ న్యూస్.. రూ.40 వేల వేతనంతో ఉద్యోగాలు..?
అయితే అప్పుడు పగలు రెండు గ్రహాలు దగ్గరగా కనిపించగా ఇప్పుడు మాత్రం రాత్రి సమయంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. గురుడు, శని గ్రహాలు ఒకదానికొకటి దగ్గరగా కనిపించినా ఆ రెండు గ్రహాల మధ్య 73.5 కోట్ల కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈరోజు గురుడు, శని కలయికను చూడటం మిస్ అయితే మళ్లీ 2080 సంవత్సరం మార్చి 15వ తేదీ వరకు ఆగాల్సి ఉంటుంది. బైనాక్యులర్ సహాయంతో ఈ రెండు గ్రహాల కలయికను చూడవచ్చు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
ఈరోజు సాయంత్రం 5 గంటల నిమిషాల నుంచి రాత్రి 7 గంటల 12 నిమిషాల వరకు గ్రహాలు ఒకదానికొకటి దగ్గరగా రావడాన్ని మనం చూడవచ్చు. శని గ్రహం మసకగా కనిపించగా గురు గ్రహం ప్రకాశవంతమైన నక్షత్రంలా పెద్దగా కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.