పెళ్లికి ముందు డయాబెటిస్ ఉందా.. భవిష్యత్తులో ఆ ఇబ్బందులు వస్తాయట?

ప్రస్తుత కాలంలో జీవన శైలి వల్ల చాలామంది చిన్న వయస్సులోనే డయాబెటిస్ బారిన పడుతున్నారు. కొంతమందిని మధుమేహం వేధిస్తున్నా ఆ సమస్యను బయటకు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. కొంతమందికి వంశపారంపర్యంగా డయాబెటిస్ సమస్య వేధిస్తుంది. తల్లీదండ్రులలో ఎవరికైనా డయాబెటిస్ సమస్య ఉంటే కొడుకుకూతురుకు కూడా ఆ సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి ఆహారపు అలవాట్ల వల్ల డయాబెటిస్ సమస్య వేధిస్తూ ఉంటుంది. సరైన మందులను వాడుతూ జీవన విధానంలో మార్పులు చేసుకోవడం ద్వారా డయాబెటిస్ కు […]

Written By: Kusuma Aggunna, Updated On : January 30, 2022 5:34 pm
Follow us on

ప్రస్తుత కాలంలో జీవన శైలి వల్ల చాలామంది చిన్న వయస్సులోనే డయాబెటిస్ బారిన పడుతున్నారు. కొంతమందిని మధుమేహం వేధిస్తున్నా ఆ సమస్యను బయటకు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. కొంతమందికి వంశపారంపర్యంగా డయాబెటిస్ సమస్య వేధిస్తుంది. తల్లీదండ్రులలో ఎవరికైనా డయాబెటిస్ సమస్య ఉంటే కొడుకుకూతురుకు కూడా ఆ సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి.

కొంతమందికి ఆహారపు అలవాట్ల వల్ల డయాబెటిస్ సమస్య వేధిస్తూ ఉంటుంది. సరైన మందులను వాడుతూ జీవన విధానంలో మార్పులు చేసుకోవడం ద్వారా డయాబెటిస్ కు చెక్ పెట్టవచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకుని మందులను నిత్యం వాడుతూ ఉంటే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయని చెప్పవచ్చు. డయాబెటిస్ తో బాధ పడేవాళ్లు వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి.

వైద్యులను సంప్రదించి వైద్యుల సలహాలు, సూచనలు పాటించడం ద్వారా ఎలాంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉండదు. ఊబకాయులు బరువు తగ్గడం ద్వారా డయాబెటిస్ బారిన పడకుండా శరీర బరువును అదుపులో పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. వ్యాయామం చేయడం ద్వారా ఊబకాయంతో బాధ పడేవాళ్లకు షుగర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని చెప్పవచ్చు.

ఉప్పు, చక్కెర పదార్థాలను వీలైనంత తక్కువగా తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినడం ద్వారా షుగర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఖనిజాలు, విటమిన్లు ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడంతో పాటు ఆల్కహాల్ ను తీసుకోవడం మానుకుంటే ఆరోగ్య సమస్యలు దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేసుకోవచ్చు.