Covid Tests: కొవిడ్ కేసులు మన దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా కరోనా ఆర్టీపీసీఆర్ టెస్టు కంపల్సరీ చేస్తున్నారు. కొవిడ్ టెస్టు రిపోర్టు నెగెటివ్ ఉంటేనే లోపలికి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక విమానాశ్రయాల్లో అయితే మస్ట్. ఈ క్రమంలోనే ఇటీవల ఎయిర్ పోర్టులో టెస్టు చేసుకునేందుకు ముందరే బయట టెస్ట్ చేయించుకున్నాడు. నెగెటివ్ రిపోర్టు వచ్చింది. దాంతో హ్యాపీగా ఫీలయి విమానాశ్రయంలోనూ టెస్ట్ చేయించుకున్నాడు. కానీ, అక్కడ పాజిటివ్ వచ్చింది. దాంతో తన ప్రయాణం రద్దు చేసుకున్నాడు. అయితే, ఆ రిపోర్టు ఫేక్ అని తెలియడంతో ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..

కర్నాటక స్టేట్‌లోని బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్లాలన్నా, రావాలన్నా అక్కడి ల్యాబ్‌లో ప్రతీ ఒక్కరు కంపల్సరీగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ టెస్టుల్లో నెగెటివ్ రిపోర్టు వస్తేనే సిబ్బంది ప్రయాణాలకు అనుమతిస్తారు. కొవిడ్ నిబంధనల్లో భాగంగా వారు ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ఓ వ్యక్తికి ఆ విధంగా టెస్టు చేయగా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. అయితే, అతను ఆ టెస్టుకు ముందరే బయట టెస్టు చేసుకుంటే నెగెటివ్ రిపోర్టు వచ్చింది. దాంతో విమానాశ్రయ సిబ్బంది పనితీరుపై అనుమానం వచ్చింది.
అలా విమానాశ్రయ సిబ్బంది ఇష్టానుసారంగా కొవిడ్ రిపోర్టు ఇస్తున్నాడని తెలుసుకున్న ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇలా విమానాశ్రయ సిబ్బంది తమ ఇష్టానుసారం కొవిడ్ రిపోర్టులు ఇస్తున్నారని ఆరోపణలు వస్తుండగా, తాజాగా ఈ ఘటనతో విషయం సిబ్బంది పనితీరు బయట పడింది. సిబ్బంది కొవిడ్ టెస్టు చేస్తున్న టైంలో మద్యం మత్తులో ఉన్నాడని, అందువల్లే తనకు పాజిటివ్ రిపోర్టు ఇచ్చాడని తెలుసుకున్న వ్యక్తి ఫైర్ అయ్యాడు.
విమానాశ్రయ సిబ్బంది వలన తాను దుబాయ్‌కి వెళ్లలేకపోయానని, ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారని బాధిత యువకుడు ప్రశ్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి కూడా. ఇకపోతే సిబ్బంది అడిగినంత డబ్బు ముట్టజెప్పితే తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చేందుకుగా రెడీగా ఉంటారని ఆరోపణలు వస్తున్నాయి. విమానాశ్రయ అధికారులు సిబ్బంది చేతివాటంపైన దృష్టి సారించాలని, తప్పుడు నివేదికలు ఇవ్వకుండా తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా బాధిత యువకుడు డిమాండ్ చేస్తున్నాడు.