Lata Mangeshkar Health Update: భారతీయ గాన కోకిల లతా మంగేష్కర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆమెకి కరోనా పాజిటివ్ అని తెలిసిన దగ్గర నుంచీ ఆమె అభిమానులు, ప్రేక్షకులు ఆందోళన పడుతున్నారు. కారణం.. వయస్సు పైబడిన వారి పై కరోనా ఎక్కువ ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం ఆమె వయసు 92 ఏళ్లు. అందుకే, ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతూ ఆమె హెల్త్ అప్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా లతా మంగేష్కర్ లేటెస్ట్ హెల్త్ అప్ డేట్ వచ్చింది. ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. గతం కంటే ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగైనట్లు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. రెండ్రోజుల క్రితం ఆమెకు వెంటిలేటర్ సపోర్టును తొలగించి.. ICUలోనే ఉంచి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి పై ఆమె కుటుంబ సభ్యులు ఇలాగే స్పందించారు.
ఇక లతా మంగేష్కర్ కి కరోనా సోకినప్పటి నుంచి ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అన్నట్టు ఆమె.. మరో వారం పాటు
ఐసీయూలోనే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. వయసు రీత్యా ఆమె కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని.. ఇన్‌ఫెక్షన్లు నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నట్లు వైద్యులు తెలిపారు.
లతా మంగేష్కర్ కి కోవిడ్ లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని తెలిసి ఆమె అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. కరోనా మైల్డ్ లక్షణాలున్న వారు ఎలాంటి ఇబ్బంది పడకుండానే కోలుకుంటున్నారు. మొత్తానికి లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి బాగుంది.