Summer Health Tips: ఈ వేసవిలో తప్పక తాగాల్సిన ఆరోగ్యకర 7 మ్యాంగో లస్సీలు ఇవే

మ్యాంగో లస్సీ శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు మామిడిపండ్లలో అనేక పోషకాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Written By: Swathi Chilukuri, Updated On : May 6, 2024 5:26 pm

Healthy mango lassi

Follow us on

Summer Health Tips: ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్ నడుస్తోంది. దీంతో ఏ మార్కెట్ లో చూసినా మామిడి పండ్లే కనిపిస్తున్నాయి. వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్లకు మంచి గిరాకీ ఉంటుంది. ఈ మామిడి పండ్లతో పలు రకాల రెసిపీలను ట్రై చేయవచ్చు. తీవ్రమైన ఎండలున్న నేపథ్యంలో చల్లగా మ్యాంగో లస్సీని తాగితే ఆ మస్తీనే వేరు.

మ్యాంగో లస్సీ శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు మామిడిపండ్లలో అనేక పోషకాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం మరియు ఫోలేట్ సహా ఎన్నో ఖనిజాలు మామిడిలో ఉంటాయి.దాంతో పాటుగా బీటా కెరోటిన్, క్వెర్సెటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లకు మూలమని చెప్పుకోవచ్చు.

మామిడిపండ్లలో ఉండే విటమిన్ సి మన రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో మంచిగా పని చేస్తుంది. దీని ద్వారా శరీరం అంటువ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. అదేవిధంగా ఇందులో ఉండే అమైలేస్ వంటి ఎంజైములు జీర్ణక్రియ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. మామిడి పండ్లలో ఉండే ఫైబర్, విటమిన్ సి మరియు పెక్టిన్ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది. దీని ద్వారా గుండె సంబంధిత జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది.

అయితే మ్యాంగో లస్సీని ఎలా తయారు చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ పద్ధతులను ఫాలో అయిపోండి..

మ్యాంగో టర్మరిక్ లస్సీ.. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక కప్పు మామిడి పండు గుజ్జుతో పాటు రెండు కప్పుల పెరుగును తీసుకోవాలి. వీటిలో తేనెతో పాటు ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. అంతే చల్లగా అయ్యాక సర్వ్ చేసుకోండి..మ్యాంగో టర్మరిక్ లస్సీ రెడీ అయినట్లే. తరువాత మ్యాంగో ఆల్మండ్ లస్సీ.. ఒక కప్పు మామిడిపండు గుజ్జుతో పాటు పది లేదా 12 నానబెట్టిన బాదం పప్పులను వేసుకుని మెత్తగా బ్లెండ్ చేయాలి. ఇందులో రెండు కప్పుల పెరుగు, కాస్త తేనె, కీవ్రా నీటిని వేసి బాగా కలుపుకోవాలి. అంతే మీ లస్సీ రెడీ అయిపోతుంది.

మ్యాంగో మింట్ లస్సీ.. ఇందుకోసం ఒక కప్పు పల్ప్, రెండు కప్పుల పెరుగు, 4 నుంచి 6 పుదీనా ఆకులు, తేనె మరియు కాస్త ఐస్ ను వేసి బాగా కలపాలి.. తరువాత మామిడి కొబ్బరి లస్సీ.. రెండు కప్పుల కొబ్బరి పాలు, ఒక కప్పు మామిడి పండు గుజ్జు మరియు కొబ్బరి క్రీమ్ తో పాటు మాపుల్ సిరప్ ను ఉపయోగించి లస్సీని తయారు చేసుకోవాలి. మ్యాంగో వాల్ నట్ లస్సీ.. దీనికోసం ముందుగా 5 నుంచి 8 వాల్ నట్ లను నీటిలో నానబెట్టాలి. ఆపై దానికి ఒక కప్పు మామిడి పండు గుజ్జు, రెండు కప్పుల పెరుగు, తేనెతో పాటు దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలపాలి. కాసేపు ఫ్రీజ్ లో పెట్టి తాగితే ఆ ఆనందమే వేరు. మరి మీరు కూడా ఈ మ్యాంగో లస్సీ రెసిపీలను ట్రై చేసేయండి.