https://oktelugu.com/

Harish Gupta : ఏపీ DGPగా హరీశ్ గుప్తా.. అసలు ఎవరీయన.. బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?*

సుమారు రెండు సంవత్సరాల రెండు నెలల పాటు ఆయన డీజీపి పదవిలో కొనసాగారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ బదిలీ వేటు వేయడంతో.. సీనియర్ అధికారిగా ఉన్న హరీష్ కుమార్ గుప్తాకు లైన్ క్లియర్ అయ్యింది. హరీష్ నేతృత్వంలో ఎన్నికలు జరగనున్నాయి.

Written By:
  • NARESH
  • , Updated On : May 6, 2024 / 05:45 PM IST
    Follow us on

    Harish Gupta : ఆంధ్రప్రదేశ్ నూతన డిజిపిగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఈయన 1992 ఐపీఎస్ బ్యాచ్ కు చెందినవారు. రాష్ట్ర డిజిపిగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డి పై ఎలక్షన్ కమిషన్ బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. అడ్డగోలుగా డిజిపిగా నియమితులయ్యారని.. వైసిపికి అనుకూలంగా పనిచేస్తున్నారని తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన ఈసీ ఆయనపై బదిలీ వేటు వేసింది. సి ఎస్ జవహర్ రెడ్డికి సమాచారం ఇచ్చింది. ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లతో కూడిన ప్యానెల్ ను రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపింది. అందులో ఆర్టిసి ఎండి ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తా పేర్లను సిఫార్సు చేయగా.. ఎలక్షన్ కమిషన్ హరీష్ కుమార్ గుప్తాను ఎంపిక చేసింది.

    నూతన డిజిపిగా నియమితులైన హరీష్ కుమార్ గుప్త తెలుగు రాష్ట్రాల్లో పనిచేశారు. ముఖ్యంగా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో, బాధిత జిల్లాల్లో పోలీస్ సూపరిండెంట్ గా పనిచేసిన అనుభవం ఉంది ఆయనకు. హైదరాబాద్ నగరంలో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా పనిచేశారు. ఉన్నత విద్యావంతుడు కూడా. యూఎస్ లో చదువుకున్నారు. ఏపీలో ఎడిజీపి లా అండ్ ఆర్డర్ చైర్మన్గా కూడా కొనసాగారు. ఇండియన్ పోలీస్ మెడల్ తో పాటు ప్రెసిడెంట్ మెడల్స్ ను, పతకాలను అందుకున్నారు.

    వాస్తవానికి హరీష్ కుమార్ గుప్తా ఏనాడో డీజీపీ కావాల్సి ఉంది. వైసిపి ప్రభుత్వం సీనియర్ అధికారుల జాబితాలో.. 11వ స్థానంలో ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డిని తెచ్చి ఇంచార్జ్ డిజిపిగా నియమించింది. అయితే దీనిపై విపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనా వినలేదు. సుమారు రెండు సంవత్సరాల రెండు నెలల పాటు ఆయన డీజీపి పదవిలో కొనసాగారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ బదిలీ వేటు వేయడంతో.. సీనియర్ అధికారిగా ఉన్న హరీష్ కుమార్ గుప్తాకు లైన్ క్లియర్ అయ్యింది. హరీష్ నేతృత్వంలో ఎన్నికలు జరగనున్నాయి.