విశాఖలో మరో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నాలుగు వైజాగ్ నగరంలోనే నమోదయ్యాయి. వీరందరూ ఢిల్లీలో జరిగిన మతపరమైన సమ్మేళనంలో పాల్గొన్నారు. వీటితో కలిపి ఏపీలో మొత్తం 44 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని మార్చి 13,14, 15 తేదీలలో ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో అంతర్జాతీయ స్థాయిలో రెండున్నర రోజులపాటు ఓ సదస్సు జరిగింది. ఈ ప్రార్ధనలకు దేశ, విదేశాలకు చెందిన వారు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. థాయ్‌ లాండ్, […]

Written By: Neelambaram, Updated On : April 1, 2020 11:32 am
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నాలుగు వైజాగ్ నగరంలోనే నమోదయ్యాయి. వీరందరూ ఢిల్లీలో జరిగిన మతపరమైన సమ్మేళనంలో పాల్గొన్నారు. వీటితో కలిపి ఏపీలో మొత్తం 44 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దేశ రాజధాని మార్చి 13,14, 15 తేదీలలో ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో అంతర్జాతీయ స్థాయిలో రెండున్నర రోజులపాటు ఓ సదస్సు జరిగింది. ఈ ప్రార్ధనలకు దేశ, విదేశాలకు చెందిన వారు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. థాయ్‌ లాండ్, ఇండోనేసియా, మలేసియా, కిరిగిస్థాన్, ఇరాన్, ఉజ్ బెకిస్తాన్ తదితర ఆసియా దేశాలకు చెందిన వారు పాల్గొనగా, ఈ ప్రార్థనలకు ఇతర దేశాల నుంచి మత పెద్దలు సైతం వచ్చినట్టుగా అధికారుల విచారణలో తెలిసింది. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2 వేల మంది హాజరుకాగా, వీరిలో అత్యధికులు మార్చి 14-,15వ తేదీల్లో తమ తమ ప్రాంతాల నుంచి రైళ్లలో వెళ్లారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన వారంతా కలిసే ప్రయాణించడంతో పాటు ఢిల్లీలో ఉన్నన్నీ రోజులు కలిసే బస చేశారు. తిరుగు ప్రయాణంలో వీరంతా దురంతో ఎక్స్‌ప్రెస్, ఏపీ ఎక్స్‌ప్రెస్‌ లలో ప్రయాణించినట్టుగా అధికారులు గుర్తించారు.