E-shram Card: కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు ప్రయోజనం చేకూరేలా ఈ-శ్రమ పోర్టల్‌ను గతేడాది ఆగష్టు నెలలో మొదలుపెట్టింది. ఈ పోర్టల్ సహాయంతో కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికుల సమాచారాన్ని సేకరించడంతో పాటు వాళ్లకు అన్ని ప్రభుత్వ పథకాలకు అర్హత పొందే అవకాశాన్ని కేంద్రం కల్పిస్తోంది. ఈ శ్రమ్ కార్డ్ సహాయంతో ప్రభుత్వ స్కీమ్స్ నుంచి సులువుగా ఉపాధి పొందడం సాధ్యమవుతుంది.
కార్మికులకు ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక కార్డు ఈ శ్రమ్ కార్డు కాగా ఈ కార్డును చూపించడం లేదా సమర్పించడం ద్వారా కార్మికులు తమ ప్రయోజనాలను పెద్దగా పొందాల్సిన అవసరం అయితే ఉండదు. ఈ కార్డు వల్ల దేశంలో కూలీలు ఎక్కడైనా ఉపాధిని పొందవచ్చు. ఈ పోర్టల్ లో నమోదైన కార్మికులకు 2 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా కవరేజీని పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
Also Read: రూ.4,500తో నెలకు 51,000 రూపాయలు పొందే అవకాశం.. ఎలా అంటే?
కార్మికుడికి పాక్షికంగా అంగవైకల్యం కలిగితే ఈ స్కీమ్ కింద లక్ష రూపాయల బెనిఫిట్ ను పొందవచ్చు. ఈ కార్డు సహాయంతో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అన్ని పథకాల ప్రయోజనాలను పొందడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. https://eshram.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో ఉచితంగానే నమోదు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
కార్మికులు పేరు, వృత్తి, చిరునామా, విద్యార్హత, నైపుణ్యం ఇతర వివరాలను పోర్టల్ లో రిజిస్టేషన్ కోసం అందించాల్సి ఉంటుంది. కార్మికుడు ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా ఈ స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
Also Read: ఈ తప్పులు చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం.. పేదరికంలో మగ్గిపోవాల్సిందే?
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Good news for eshram card holders rs 2 lakh benefit
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com