మన దేశవ్యాప్తంగా అమలవుతున్న స్కీమ్స్ లో వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. కేంద్రం అమలు చేస్తున్న ఈ స్కీమ్ ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ ద్వారా రేషన్ కార్డును కలిగి ఉన్నవాళ్లు సబ్సిడీ ధరకే సరుకులను పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఈ విధంగా బెనిఫిట్స్ ను పొందాలని అనుకుంటే రేషన్ కార్డుకు ఆధార్ కార్డును కచ్చితంగా లింక్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఆధార్, రేషన్ కార్డ్ నంబర్లతో పాటు ఇతర వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రిజిష్టర్డ్ మొబైల్ నంబర్ కు వచ్చే వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వెబ్ పేజీలో ఓటీపీని ఎంటర్ చేసి ఆధార్ ధృవీకరణను పూర్తి చేయడం ద్వారా ఆధార్ ధృవీకరణ పూర్తవుతుందని చెప్పవచ్చు. ఆఫ్ లైన్ ద్వారా కూడా రేషన్ కార్డుకు ఆధార్ కార్డును లింక్ చేసుకోవచ్చు.
ఎస్‌ఎంఎస్ ద్వారా కూడా సులభంగా ఆధార్ కార్డును రేషన్ కార్డుకు లింక్ చేయవచ్చు. uid seed అని టైప్ చేసి స్టేట్ షార్ట్ కోడ్ ను టైప్ చేసి స్కీమ్ కోడ్ ను, స్కీమ్ ఐడీని టైప్ చేసి మెసేజ్ పంపాల్సి ఉంటుంది. ఈ విధంగా రేషన్ కార్డుకు ఆధార్ ను సులువుగా లింక్ చేయవచ్చు.