Media House Criticism: పాత్రికేయులతో యాడ్స్ చేయిస్తాయి. సర్కులేషన్ చేయిస్తాయి. అవసరమైతే ఇంకా చాలా పనులు చేయిస్తాయి. ఇంత చాకిరీ చేసినప్పటికీ చెప్పుకునే జీతాలు ఉండవు. గొప్పగా అనుకునే భత్యాలు ఉండవు. ఏదో బయట నమస్తే లు.. టీ లు, టిఫిన్లు తప్ప.. ఇలాంటి మీడియా సంస్థల యాజమాన్యాలు మాత్రం అంతకంతకు ఎదిగిపోతుంటాయి. ఖరీదైన కార్లు.. విలాసవంతమైన భవనాలు.. విస్తారమైన స్థలాలు కొనుగోలు చేస్తూ ఉంటాయి. తెలుగు నాట ఇలా అడ్డగోలుగా ఎదిగిన మీడియా సంస్థలు చాలా ఉన్నాయి. వీటిలో ఏ సంస్థ కూడా ఉద్యోగుల బాగోగులు చూసిన దాఖలాలు లేవు. చివరికి విధి నిర్వహణలో కన్నుమూసినా కూడా పట్టించుకున్న సందర్భాలు లేవు.
Also Read: ట్రెండ్ మార్చిన యాంకర్ స్రవంతి… లంగా ఓణీలో కొంటె ఫోజులు! వైరల్ ఫోటోలు
ఆ మీడియా సంస్థలు మాత్రం నీతులు చెబుతుంటాయి. సమాజాన్ని ఉద్ధరిస్తున్నామంటూ కలరింగ్ ఇస్తుంటాయి. మీడియా స్వేచ్ఛ.. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం.. విలువలు.. ఇంకా చాలా మాటలు చెబుతుంటాయి. కానీ వాస్తవంలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. యాడ్స్ కోసం అంగలార్చే వ్యవహారం.. సర్కులేషన్ పెంపుదల కోసం అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడే దిగజారుడుతనం.. తెలుగు మీడియాలో అధికంగా ఉంటుంది. అందుకే దేశవ్యాప్తంగా విశ్వసనీయమైన మీడియాలో తెలుగు సంస్థలకు చోటు లేకపోవడం విశేషం. అయితే ఇలాంటి చోట విలువల గురించి పక్కన పెడితే.. విశ్వసనీయత గురించి కాస్త దూరం జరిగితే.. ఉద్యోగుల బాగోగుల విషయంలో ఓ యూట్యూబ్ ఛానల్ మాత్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఒకరకంగా సంచలనాలకు వేదిక అవుతున్నది.
సరిగ్గా కొన్ని సంవత్సరాల క్రితం యూట్యూబ్లో సంచలనంగా ఆ ఛానల్ తెరపైకి వచ్చింది. గతంలో ఎవరూ చేయలేని ప్రయోగాలను చేసింది. ఒక రకంగా యూట్యూబ్ ఛానల్ ఇలా కూడా నిర్వహించవచ్చని నిరూపించింది. ఈ క్రమంలోనే సరికొత్త రికార్డులను సృష్టించింది. హోమ్ టూర్ నుంచి మొదలు పెడితే చిన్న చిన్న విషయాల వరకు ప్రతీది ఆ యూట్యూబ్ ఛానల్ దృష్టిలో వార్తగా రూపుదిద్దుకుంది. అనతి కాలంలోనే ఆ ఛానల్ అంతకంతకూ విస్తరించింది. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఆ ఛానల్ కు సంబంధించిన అనేక విభాగాలు కళ్ళ ముందు కనిపిస్తుంటాయి. ఆ ఛానల్ ఈ స్థాయిలో ఎదగడం వెనుక ఉద్యోగులు ఉన్నారనే విషయాన్ని గుర్తించి.. వారి సంక్షేమం కోసం పాటుపడుతోంది.
Also Read: బోల్డ్ తక్కువ బ్యూటీ ఎక్కువ. చీరలో కూడా బొడ్డు చూపించకుండా నిండుగా ఉన్న ఈ స్టార్ ను చూశారా?
ఆ ఛానల్ వార్షికోత్సవం సందర్భంగా యాజమాన్యం ఉద్యోగులకు గతంలో బెంజ్ కార్లను అందించింది. ఉద్యోగుల స్థాయి ఆధారంగా బహుమతులు ఇచ్చింది. కొంతమంది ఉద్యోగులను సీఈవోలుగా నియమించింది. అంతేకాదు నెలకు 5 లక్షల వేతనంతో వారికి తీపి కబురు అందించింది. ఇప్పుడు తమ సంస్థలో 5 సంవత్సరాలకు మించి పనిచేసిన ఉద్యోగులకు యాజమాన్యం డబుల్ బెడ్ రూమ్ ప్లాట్లు అందించింది. మీడియాలో పనిచేస్తున్న వ్యక్తులతో గొడ్డు చాకిరి చేయించుకుంటున్న యాజమాన్యాలు.. ఉద్యోగుల సంక్షేమాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. పైగా ఆ యాజమాన్యాలకు రాజకీయంగా అండదండలు కూడా ఉన్నాయి ఆర్థికంగా అంతకుమించి అనే స్థాయిలో చెప్పుకునే మూలాలు కూడా ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పటికీ ఉద్యోగుల గురించి ఎన్నడూ ఆ సంస్థలు ఆలోచించలేదు. ఒక యూట్యూబ్ ఛానల్ యాజమాన్యం మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించి.. ఉద్యోగుల సంక్షేమానికి పాటుపడుతుండడం నేటి రోజుల్లో నిజంగా అభినందనీయం.