https://oktelugu.com/

Pooja Hegde: సొంతింటి కలను పూర్తి చేసుకుంటున్న పూజా హెగ్డే …

Pooja Hegde: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఇప్పుడు వరుస సినిమాలతో మోస్ట్  బిజియెస్ట్ ఆర్టిస్ట్ గా మారింది. ఇటీవల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తో ప్రేక్షకులను అలరించింది ఈ భామ. ఈ మూవీలో  అక్కినేని అఖిల్ కి జోడీగా నటించింది ఈ బుట్టబొమ్మ. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి  రెస్పాన్స్ సొంతం చేసుకుంటూ… కలక్షన్ల పరంగా కూడా దూసుకుపోతుంది. ప్రస్తుతం పూజా నటించిన  రాధేశ్యామ్, ఆచార్య  చిత్రాలు విడుదలకి సిద్దంగా ఉన్నాయి. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 28, 2021 / 10:36 AM IST
    Follow us on

    Pooja Hegde: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఇప్పుడు వరుస సినిమాలతో మోస్ట్  బిజియెస్ట్ ఆర్టిస్ట్ గా మారింది. ఇటీవల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తో ప్రేక్షకులను అలరించింది ఈ భామ. ఈ మూవీలో  అక్కినేని అఖిల్ కి జోడీగా నటించింది ఈ బుట్టబొమ్మ. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి  రెస్పాన్స్ సొంతం చేసుకుంటూ… కలక్షన్ల పరంగా కూడా దూసుకుపోతుంది. ప్రస్తుతం పూజా నటించిన  రాధేశ్యామ్, ఆచార్య  చిత్రాలు విడుదలకి సిద్దంగా ఉన్నాయి. అయితే తాజాగా తన సొంతింటి నిర్మాణంపై దృష్టి పెట్టింది పూజా హెగ్డే.

    తాజాగా ఈ భామ ముంబైలో ఓ ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ ఇంట్లో తన టేస్ట్‌కు తగ్గట్టు పలు మార్పులు చేయిస్తున్నట్లు కనబడుతుంది. సొంత ఇల్లు కలిగివుండడం అనేది తన కల అని…  ఇప్పుడది నెరవేరుతోందంటూ పోస్ట్ పెట్టింది.  త్వరలోనే ఫ్యామిలి తో పాటు పూజా ఇక్కడికి షిఫ్ట్ అవ్వనుందని అనుకుంటున్నారు.  

    పూజా సినిమాల విషయానికి వస్తే  త్రివిక్రమ్ – మహేశ్ కాంబో తెరకెక్కనున్న సినిమా లోనూ, హరీష్ శంకర్ – పవర్ స్టార్ చిత్రం లోనూ పూజ హెగ్డే హీరోయిన్ గా ఓకే అయినట్లు తెలిసిందే. మరోవైపు పూజా హెగ్డే సల్మాన్ ఖాన్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘సర్కస్’లో కూడా పూజా నటిస్తోంది.  ప్రస్తుతం ఈ బుట్టబొమ్మ.. ప్రభాస్‌తో రాధేశ్యామ్‌లో నటిస్తోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. ఇప్పటికే ప్రేరణగా విడుదలైన పూజా హెగ్డే లుక్‌కు  ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.