Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు ఏమి చేసినా మనసు పెట్టి చేస్తారు. అది ఏ పని అయినా కావొచ్చు. అవేమీ బాలయ్యకు పట్టవు. చేసే పనిలో చిత్తశుద్ధి ఉండేలా చూసుకుంటాడు. అందుకే బాలయ్య లక్ష్యసిద్ధి ఎప్పుడు వర్కౌట్ అవుతూనే ఉంటుంది. మరి భవిష్యత్తులో కూడా బాలయ్య సంకల్పశుద్ధి సఫలీకృతం అవుతుందని చెప్పడానికి ఎలాంటి అనుమానం లేదు. సరే.. ఈ చిత్తశుద్ధి, లక్ష్యసిద్ధి ఇప్పుడు ఎందుకు అంటే.. వీటి పైనే బాలయ్యతో ఒక ప్రోమో వదిలారు ‘ఆహా’ వాళ్ళు.

బాలయ్య ‘ఆహా‘ కోసం హోస్ట్ గా అలరించబోతున్న సంగతి తెలిసిందే. ‘అన్‌స్టాపబుల్’ అనే ప్రోగ్రామ్ తో బాలయ్య యాంకర్ గా తనదైన శైలిలో అలరించడానికి కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటికే మోహన్ బాబుతో ఫస్ట్ ఎపిసోడ్ ను షూట్ చేశారు కూడా. ‘ఆహా’ఓటీటీ లో ప్రసారంకానున్న ఈ షోకి సంబంధించిన తాజాగా వదిలిన ప్రోమో బాగా ఆకట్టుకుంటుంది. ప్రోమోలో బాలయ్య పై స్టైలిష్ షాట్స్ ను బాగా కంపోజ్ చేశారు.
అలాగే బాలయ్య చెప్పిన డైలాగ్ కూడా చాలా బాగుంది. ఇంతకీ బాలయ్య చెప్పిన డైలాగ్ ఏమిటంటే.. ‘నీకు చిత్తశుద్ధి ఉన్నప్పుడు.. నీకు లక్ష్యసిద్ధి ఉన్నప్పుడు.. నీకు సంకల్పశుద్ధి ఉన్నప్పుడు.. ఏమిటి ? నిన్ను పంచభూతాలు కూడా ఆపలేవు’ అంటూ బాలయ్య బాబు రౌద్రంగా బేస్ వాయిస్ తో స్ట్రెస్ చేసి డైలాగ్ చెప్పిన విధానం అదిరిపోయింది. అసలు డైలాగ్ లు చెప్పడంలో బాలయ్య తర్వాతే ఎవరైనా అనిపించింది ఈ డైలాగ్ వింటుంటే.
Maatallo filter undadu, Saradalo stop undadu, Sye ante sye, Nye ante nye 😎
Debbaku thinking maaripovala! #UnstoppableWithNBK episode 1 premieres November 4th.Promo Out Now 💥💥#NandamuriBalakrishna #MansionHouse @swargaseema #NandGokulGhee pic.twitter.com/WdgALLWF7L
— ahavideoIN (@ahavideoIN) October 27, 2021
ఇక ఈ ప్రోమోలో హైలైట్ అయిన మరో ముఖ్యమైన డైలాగ్ ‘మాటల్లో ఫిల్టర్ ఉండదు.. సరదాలో స్టాప్ ఉండదు’ అంటూ బాలయ్య మీసం పేలుస్తూ.. చిన్న సీరియస్ లుక్ ఇస్తూ.. ‘సై అంటే సై.. నై అంటే నై.. వన్స్ ఐ స్టెప్ ఇన్.. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా” అని బాలయ్య డైలాగ్ చెప్పిన స్టైల్ కూడా చాలా బాగా ఆకట్టుకుంది. అలాగే ఈ ప్రోమోలో కొన్ని ప్రత్యేక ఆకర్షణలు ఉన్నాయి.
Also Read: Romantic: ‘రొమాంటిక్’ లో రామ్ మాస్ స్టెప్పులు అదిరిపోయాయి !
బాలయ్య గుర్రం పై వచ్చే షాట్స్, అలాగే బాలయ్య కార్ లో డ్రైవ్ చేస్తూ నిప్పుల గుండాన్ని కూడా ఢీ కొట్టి వెళ్లే షాట్స్ చాలా బాగున్నాయి. ఇక ప్రోమోలో బాలయ్య లుక్స్, అండ్ స్టైల్ అభిమానుల్ని ఫిదా చేసింది. అన్నట్టు నవంబరు 4 నుంచి ఈ ‘అన్‌స్టాపబుల్’ ప్రోగ్రామ్ మొదలుకానుంది.
Also Read: Samantha: కుమార్తె పెళ్లి కోసం కాదు… ఆమె చదువు కోసం డబ్బు దాచి పెట్టండి : సమంత