Sankranthi: సంక్రాంతి అంటేనే కోళ్ల పందాలు. కోళ్ల పందాల కోసం అందరు రెడీ అయిపోయారు. వేల కోట్ల బెట్లతో కోళ్ల పందాలు రక్తికట్టనున్నాయి. కోర్టు ఆంక్షలున్నా పోలీసల హెచ్చరికలు చేసినా పట్టించుకోవడం లేదు. దీంతో రాష్ర్టంలో గోదావరి జిల్లాల్లో కోళ్ల పందాలు కనువిందు చేయనున్నాయి. కరోనా ప్రభావంతో రెండేళ్లుగా వేడుకలకు దూరంగా ఉన్న వారు ప్రస్తుతం ఆ రెండేళ్ల కసి తీర్చుకోవాలని సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఏపీ మొత్తం గ్రామాలన్నీ సంక్రాంతి వేడుకల్లో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు.
కొత్త ఊపుతో పాత కోళ్ల పందాల కేంద్రాల వద్ద హడావిడి మొదలైంది. పందాల్లో గెలవాలని కోళ్లను తీసుకొస్తున్నారు. బెట్టింగ్ లతో అందరిని అలరిస్తున్నారు. రాజసంతో కోళ్లు రెడీ అయ్యాయి. నువ్వా నేనా అనే రీతిలో కోళ్లు తీసుకొచ్చి పందాలకు ప్రతినబూనుతున్నారు. తమ కోడే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పౌష్టికారంతో పాటు అన్ని రకాల ధాన్యాలు తినిపించి బలిష్టంగా తయారు చేసిన కోడి పుంజులు పందెంలో పాల్గొననున్నాయి.
Also Read: UP యూపీలో బీజేపీకి వరుస షాక్‌లు.. ఈసారి గెలుపు కష్టమేనా?
పందాల్లో పాల్గొనే కోళ్లకు కత్తులు కట్టేందుకు రెడీ అవుతున్నారు. కోడి పందాల నిర్వహణపై ఎన్ని ఆంక్షలున్నా పట్టించుకోవడం లేదు. పోలీసులు కోడి పందాల రాయుళ్లను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చినా వారిలో మార్పు కనిపించడం లేదు. దీంతో కోడి పందాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఎన్ని ఆంక్షలు ఉన్నా తగ్గేదే లే అని పందాలకు తయారయ్యారు. కోళ్ల కత్తులు, కోళ్లను స్వాధీనం చేసుకున్నా పందాలు మాత్రం ఆగడం లేదు.
కోళ్ల పందాలకు ఎంత డబ్బు ఖర్చు చేయడానికైనా వెనుకాడరు. మూడు రోజుల పాటు కోడి పందాలు ఆడేందుకు సిద్ధమయ్యారు. వాటిని వీక్షించేందుకు కూడా స్టేట్లు, దేశాలు దాటి కూడా చాలా మంది వస్తున్నారు. డబ్బు సంపాదించాలని కొందరు, ఆట చూడాలని మరికొందరు గ్రామాలకు చేరుకుంటున్నారు. సంప్రదాయ క్రీడల పేరుతో కోడి పందాలు నిర్వహించేందుకు మినీ స్టేడియాలు ఏర్పాటు చేస్తున్నారు. లైటింగ్ కూడా సిద్ధం చేశారు.
గతేడాది సంక్రాంతికి సుమారు రూ.2 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారని తెలిసిందే. ఈ సారి ఆ టార్గెట్ కూడా దాటి పోతుందని అంచనా వేస్తున్నారు. కోడి పందాలకు పేరున్న ఏపీలో కోళ్ల పందాలు చూడ ముచ్చటగా సాగుతున్నాయి. లక్షలాది మంది తమ గ్రామాలకు చేరుకుని సంక్రాంతి పండుగ వేడుకల్లో భాగంగా కోడి పందాలతోనే సరదాగా గడపనున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం పిల్లలపై ఎంతంటే?