Homeఎంటర్టైన్మెంట్Samantha: మరోసారి త్రివిక్రమ్ డైరెక్షన్‌లో సమంత..?

Samantha: మరోసారి త్రివిక్రమ్ డైరెక్షన్‌లో సమంత..?

Samantha: బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత.. నాగచైతన్యతో డైవోర్స్ తర్వాత తన ప్రొఫెషనల్ కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టేసింది. వరుస సినిమాల అప్ డేట్స్ ఇస్తోంది. పాన్ ఇండియా ఫిల్మ్స్ తో పాటు ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ కు కూడా ఓకే చెప్తోంది. ఈ సంగతులు అలా ఉంచితే.. సమంతకు మరోసారి క్రేజీ ఆఫర్ వచ్చేసిందని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి.

Samantha
Samantha

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ఒకటి సమంత చేయబోతున్నదని తెలుస్తోంది. ఓ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. నిజానికి త్రివిక్రమ్-మహేశ్ కాంబోలో మూవీ చేయాల్సి ఉండగా, ‘సర్కారు వారి పాట’ ఫిల్మ్ రిలీజ్ అయ్యేంత వరకు మహేశ్ ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొనే చాన్సెస్ లేవట. ఈ నేపథ్యంలో ఖాళీ సమయంలో ఓ సినిమా చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారట. అయితే, ఈ వార్తలో నిజమెంత ఉందనేది అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చాకే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read: ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం పిల్లలపై ఎంతంటే? 

సమంత ఇటీవల పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’లో స్పెషల్ సాంగ్ చేసింది. దాంతో పాటు పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’, కోలీవుడ్ సినిమా ‘కాతు వాకుల రెండు కాదల్’ షూటింగ్ కంప్లీట్ చేసింది. తాజాగా ‘యశోద’ అనే పాన్ ఇండియా ఫిల్మ్ కూడా అనౌన్స్ చేసింది. ఈ క్రమంలోనే ఒకవేళ త్రివిక్రమ్ మూవీ ఓకే చెస్తే ..కనుక సమంత సినిమాల్లో చాలా బిజీ అయిపోయినట్లే.. ‘పుష్ప’ చిత్రంలో సమంత చేసిన ‘ఊ అంటావా మావా..’ సాంగ్ కు చాలా అప్రిసియేషన్ వచ్చింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్‌గా నిలవడంతో పాటు దూసుకుపోతున్నది. కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ కేసుల పెరుగుదల నేపథ్యంలో పెద్ద చిత్రాలు ‘ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్’ విడుదల వాయిదా పడగా, సంక్రాంతి బ్లాక్ బాస్టర్‌గా ‘పుష్ప’కు నిలిచే అవకాశాలున్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ పిక్చర్‌లో బ్యూటిఫుల్ భామ రష్మిక మందన కథానాయికగా నటించింది.

Also Read: డ్యూడ్.. రైతులపై ప్రేమ.. ప్రభాస్ డైలాగ్ తో కొట్టిన తెలంగాణ మంత్రి

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

2 COMMENTS

  1. […] NTR: జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఈ నెల 7న విడుదల కావాల్సింది. కానీ, కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఆ ఫిల్మ్ రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. ఇకపోతే ఈ చిత్రం తర్వాత తారక్ చేస్తున్న చిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా మూవీస్ అవుతుండటం విశేషం. ఈ సంగతులు అటుంచితే..జూనియర్ ఎన్టీఆర్ చాలా లగ్జరియస్ లైఫ్ గడుపుతారని ఆయన వాడుతున్న వస్తువులను బట్టి అర్థమవుతుంది. కాగా, ఆయన లగ్జరియస్ లైఫ్, ఆయన వద్ద ఉన్న వస్తువులపైన ఓ లుక్కేద్దాం… […]

  2. […] Bangarraju: తండ్రీ తనయుడు నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన చిత్రం ‘బంగార్రాజు’.. సంక్రాంతి కానుకగా విడుదలైంది. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫిల్మ్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సంక్రాంతికి పెద్ద సినిమాల విడుదల అవుతాయని అందరూ అనుకున్నారు. కానీ, కొవిడ్ పరిస్థితుల వలన వాయిదా పడ్డాయి. కాగా, ‘బంగార్రాజు’ చిత్రానికి అలా కొంత మేరకు అడ్వాంటేజ్ కూడా అయిందని చెప్పొచ్చు. ఇకపోతే ఈ చిత్రానికి ఫస్ట్ డేనే బంపర్ కలెక్షన్స్ వచ్చాయి. తొలి రోజున రూ.13.30 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. […]

Comments are closed.

Exit mobile version