Microsoft: లింగవివక్షపై మైక్రోసాఫ్ట్ సంస్థ కీలక నిర్ణయం.. థర్డ్ పార్టీతో నివేదిక..

Microsoft:  దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ ‘మైక్రోసాఫ్ట్’.. కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో లైంగిక వేధింపుల ఆరోపణలు, లింగవివక్షకు సంబంధించిన కంప్లయింట్స్, వాటి దర్యాప్తు వివరాలను బహిర్గతం చేయనున్నది. వివరాలన్నిటినీ బహిరంగ ప్రదర్శించనున్నట్లు తెలిపింది. ఇందుకుగాను తమ విధానాలను సమీక్షించుకుంటామని సంస్థ పేర్కొంది. మైక్రోసాఫ్ట్ సంస్థ సహ వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్‌తో పాటు బోర్డ్ డైరెక్టర్లందరికీ ఈ విషయం వర్తిస్తుందని సంస్థ అనౌన్స్  చేసింది. ఈ విషయమై ఇతర సంస్థలు ఎటువంటి విధానాలు పాటిస్తున్నాయి? ఉద్యోగులను, ఎగ్జిక్యూటివ్‌లను జవాబుదారీగా […]

Written By: Mallesh, Updated On : January 15, 2022 2:38 pm
Follow us on

Microsoft:  దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ ‘మైక్రోసాఫ్ట్’.. కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో లైంగిక వేధింపుల ఆరోపణలు, లింగవివక్షకు సంబంధించిన కంప్లయింట్స్, వాటి దర్యాప్తు వివరాలను బహిర్గతం చేయనున్నది. వివరాలన్నిటినీ బహిరంగ ప్రదర్శించనున్నట్లు తెలిపింది. ఇందుకుగాను తమ విధానాలను సమీక్షించుకుంటామని సంస్థ పేర్కొంది. మైక్రోసాఫ్ట్ సంస్థ సహ వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్‌తో పాటు బోర్డ్ డైరెక్టర్లందరికీ ఈ విషయం వర్తిస్తుందని సంస్థ అనౌన్స్  చేసింది.

Microsoft:

ఈ విషయమై ఇతర సంస్థలు ఎటువంటి విధానాలు పాటిస్తున్నాయి? ఉద్యోగులను, ఎగ్జిక్యూటివ్‌లను జవాబుదారీగా ఉంచేందుకుగాను ఎటువంటి చర్యలు తీసుకున్నాయని తెలుసుకునేందుకుగాను ప్రయత్నిస్తున్నది. ఈ విషయాలను థర్డ్ పార్టీ చేత పరిశీలన చేసిన తర్వాత ఓ నిర్ణయానికి రానుంది. ఆ తర్వాతనే మైక్రోసాఫ్ట్ సంస్థలో ఇప్పటి వరకు ఎన్ని లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణలు జరిగాయి? వాటి తీర్మానాలంటి? అనే వివరాలను బహిర్గతం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన నివేదికను రివ్యూ చేయడమే కాకుండా ఎంప్లాయిస్‌కు కావాల్సిన వాతావరణం క్రియేట్ చేయడానికి తగు చర్యలు తీసుకుంటామని, అన్ని విషయాలను తెలుసుకున్న తర్వాత ఆ దిశగా పనులు జరుగుతాయని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల పేర్కొన్నారు.

Also Read: యూపీలో బీజేపీకి వరుస షాక్‌లు.. ఈసారి గెలుపు కష్టమేనా?

ఈ క్రమంలోనే మైక్రోసాఫ్ట్ సంస్థలో అనుసరిస్తున్న విధానాలను సమీక్షించేందుకుగాను థర్డ్ పార్టీ న్యాయ సంస్థను మైక్రోసాఫ్ట్ సంస్థ నియమించుకోనుంది. అలా సమీక్షకు ముందర ఇతర ఆర్గనైజేషన్స్ వివరాలను కంప్లీట్‌గా స్టడీ చేయనున్నారు. ఇకపోతే మైక్రోసాఫ్ట్ సంస్థ సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో దిగ్గజ సంస్థగా ఉన్న నేపథ్యంలో ట్రాన్స్ పరెన్సీ కోసం ఈ విధమైన నిర్ణయాలు తీసుకునేందుకుగాను మొగ్గు చూపుతున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.
మైక్రోసాఫ్ట్ సంస్థలో పని చేయాలని చాలా మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు పోటీ పడుతుంటారు కూడా. వేరే ఇతర సంస్థల్లో పని చేసి ఈ సంస్థలో ఉద్యోగం చేసేందుకుగాను పోటీ పడుతుంటారు. సాఫ్ట్ వేర్ రంగంలో అత్యున్నతమైన దిగ్గజ సంస్థగా ఉన్న మైక్రోసాఫ్ట్‌లో ఎంప్లాయి ఫ్రెండ్లీ ఎన్విరాన్ మెంట్ క్రియేట్ చేయడంతో భాగంగానే సంస్థ అనుసరిస్తున్న విధానాలను సమీక్షిస్తున్నారని కొందరు వివరిస్తున్నారు.
Tags