Deepavali 2023: పండితుల మాట : దీపావళి 12 లేదా 13న..? మహాలక్ష్మీ పూజ ఎప్పుడు చేసుకోవాలంటే?

ఈ ఏడాది దీపావళిని ముందుగా 12న నిర్వహించుకోవాలని, ఆరోజునే సెలవు ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఆ తరువాత 13న సెలవును నిర్ణయించారు. పండితులు చెబుతున్న ప్రకారమే 13న సెలవు ప్రకటించామని అధికారులు చెప్పారు.

Written By: Srinivas, Updated On : November 11, 2023 2:34 pm

Deepavali 2023

Follow us on

Deepavali 2023: ఈ ఏడాది పండుగల విషయంలో అయోమయం నెలకొంది. మొన్న వినాయకచవితి.. నిన్న దసరా.. నేడు దీపావళి విషయంలోనూ ఏరోజు నిర్వహించుకోవాలి? అనే విషయం పై స్పష్టత రావడం లేదు. అయితే కొందరు పండితులు మాత్రం హిందూ శాస్త్రం ప్రకారం నిర్వహించుకోవాలని చెబుతుండగా.. మరికొందరు మాత్రం అమావాస్య కాలాన్ని భట్టి పండుగ చేసుకోవాలని అంటున్నారు. దీపావళి అనగానే సాయంత్రం అవగానే దీపాలు వెలిగిస్తారు. అయితే అమావాస్య రోజునే చాలా మంది పండుగను నిర్వహించుకుంటారు. కొందరు నోములు చేసుకునేవారు అమావాస్యను ప్రాతిపదికన తీసుకొని ఆరోజున నిర్వహిస్తారు.

ఈ ఏడాది దీపావళిని ముందుగా 12న నిర్వహించుకోవాలని, ఆరోజునే సెలవు ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఆ తరువాత 13న సెలవును నిర్ణయించారు. పండితులు చెబుతున్న ప్రకారమే 13న సెలవు ప్రకటించామని అధికారులు చెప్పారు. దీంతో ప్రజల్లోనూ అసలు దీపావళి 12న చేసుకోవాలా? లేదా 13న నిర్వహించుకోవాలా? అనేది అయోమయంగా మారింది. ఈ నేపథ్యంలో కొందరు పండితులు మాత్రం స్పష్టతనిచ్చారు.

చెడుపై మంచి సాధించిన విజయంగా దీపావళిని నిర్వహించుకుంటారు. మరో కథనంలో నరకాశురుడిని సత్యభామ వధించిన సందర్భంద నరక చతుర్ధి గా దీపాలను వెలిగిస్తారు. 2023 సంవత్సరం 12 ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 11 గంటల వరకు ఉంటుంది. దీపావళి ప్రత్యేక పూజలు, నోములు సాయంత్రమే నిర్వహించుకుంటున్నారు. అందువల్ల అమావాస్య కాలం సాయంత్రం ఎక్కువగా ఉన్న 12నే నిర్వహించుకోవాలని పండితులు స్పష్టంగా చెబుతున్నారు.

13వ తేదీ ఉదయం 11 గంటలకు అమావాస్య వెళ్లిపోతుండడంతో ఆరోజు సాయంత్రం లక్ష్మీ పూజలు చేయడం వృథా అని అంటున్నారు. ఈ నేపథ్యంలో 12నే అసలైన దీపావళి అని అంటున్నారు. దీంతో చాలా మంది 12న సాయంత్రం దీపావళి వేడుకలు నిర్వహించుకునేందుకు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని సంస్థలు కూడా 12నే సెలవను ప్రకటించాయి. ఈ తరుణంలో ప్రభుత్వం కూడా 13 సోమవారం సెలవును రద్దు చేస్తుందా? అనే చర్చ సాగుతోంది.