https://oktelugu.com/

Holi 2024: హోలీ అలా కూడా చేసుకుంటారా

ఉత్తరప్రదేశ్ లోని బర్సానాలో హోలీ రోజున రంగులు చల్లుకోవడమే కాదు.. మహిళలు కర్రలతో పురుషులను వెంటపడి కొడతారు. స్త్రీలంతా కర్రలనే తమ ఆయుధాలుగా ధరించి ఎక్కడ పురుషులు కనిపించినా వారిని వెంబడించి తరుముతారు.

Written By:
  • Dharma
  • , Updated On : March 24, 2024 10:54 am
    Holi 2024

    Holi 2024

    Follow us on

    Holi 2024: హోలీ.. ఇదో రంగుల పండుగ. చిన్నా పెద్ద అన్న తారతమ్యం లేకుండా.. రంగులు జల్లుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కుల, మత భేదం లేకుండా అందరూ రంగులతో ఆనందంతో మునిగి తేలుతుంటారు. అలాంటి పండుగను దేశంలో పలు రాష్ట్రాల ప్రజలు విభిన్నంగా జరుపుకుంటారు. తమ ఆచారాలకు తగ్గట్టు నిర్వహిస్తుంటారు. కానీ కొన్ని చోట్ల మాత్రం విచిత్రంగా జరుపుకుంటారు. ఎంతలా అంటే వామ్మో.. పండుగ ఇలా కూడా జరుపుకుంటారా అన్న రీతిలో.. విస్తు పోయేలా జరుపుతారు.రేపు హోలీ నేపథ్యంలోప్రత్యేక కథనం.

    ఉత్తరప్రదేశ్ లోని బర్సానాలో హోలీ రోజున రంగులు చల్లుకోవడమే కాదు.. మహిళలు కర్రలతో పురుషులను వెంటపడి కొడతారు. స్త్రీలంతా కర్రలనే తమ ఆయుధాలుగా ధరించి ఎక్కడ పురుషులు కనిపించినా వారిని వెంబడించి తరుముతారు. అయితే ఇది సీరియస్ గా కాదు. సరదాగా ఆడే సాంప్రదాయం. శ్రీకృష్ణుడు గోపికల మధ్య జరిగిన కథను గుర్తుగా ఇలా జరుపుకుంటారు. చిన్నచిన్న యుద్ధ పోటీలు, పాటలు, నృత్యాలు వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటారు.

    వారణాసిలో అయితే చితా భస్మా హోలీని నిర్వహిస్తారు. అక్కడ సాధువులు, అఘోరాలు తమ భక్తులతో మణికర్ణిక ఘాట్ దగ్గర కలిసి చితి నుంచి వచ్చే బూడిదను తీసి హోలీగా ఆడుతారు. సాధారణంగా వారణాసి అంటే మనం ముక్తి నగరంగా భావిస్తాం. అందుకు గుర్తుగా తమ శరీరాలపై చితా భస్మాన్ని పూసుకుంటారు. తద్వారా శివుడికి తమ భక్తిని తెలియజేస్తారు. వీరంతా వీధుల్లో తిరుగుతూ శివనామస్మరణ చేస్తారు. భాంగ్ అంటే గంజాయితో సమానం. గంజాయి ఇతర మత్తు పదార్థాలతో ఈ ద్రావకాన్ని తయారు చేస్తారు. హోలీ రోజు దీనిని వినియోగిస్తారు. కానీ పోలీసులు సైతం అడ్డు చెప్పరు.

    ఉత్తరప్రదేశ్ లోని ఇటావా జిల్లాలో సంతన అనే గ్రామంలో ఇప్పటికీ ఒక సాంప్రదాయం కొనసాగుతోంది. హోలీ పర్వదినాన బైసన్ దేవి ఆలయం కింద రాతి భూభాగంలో ఉన్న తేళ్ళను సేకరించి తమ శరీరాలపై పెట్టుకుంటారు. ఆ తేళ్లు తమను కుట్టవని గ్రామస్తుల నమ్మకం. మధుర సమీపంలో దౌజీ అనే గ్రామంలో అయితే మరీ వింత పరిస్థితి. మహిళలు, పురుషులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని బట్టలు చింపుకుంటారు. దీనిని ఒక వేడుకగా నిర్వహిస్తారు. చాలా ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది.