Sunil: కమెడియన్ నుంచి విలన్ గా మారిన సునీల్.. ఇంతకీ ఎలా జరిగింది

మొదటగా కమెడియన్ గా కెరీర్ ను ప్రారంభించిన సునీల్ ఆ తర్వాత తన లక్ ను పరీక్షించుకున్నాడు. ఏకంగా హీరోగా అవతారం ఎత్తి పాత్రలో లీనమై పోయాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

Written By: Suresh, Updated On : November 11, 2023 2:23 pm

Sunil

Follow us on

Sunil: టాలీవుడ్ లో విలన్, హీరో, కమెడియన్ అనే పేరు సంపాదించి ఇప్పటికీ మంచి నటుడిగా ఎన్నో సినిమాల్లో నటిస్తూ.. తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న హీరో సునీల్. ఈయ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎలాంటి సినిమాలో నటించిన ఎలాంటి పాత్రలో నటించిన ఈయన మాత్రం స్పెషల్ స్టేటస్ ను సంపాదిస్తుంటారు. డిఫరెంట్ రోల్స్ చేస్తూ అభిమానులను ఆకట్టుకోవడంలో ముందుంటారు సునీల్. ఇంతకీ ఈ కమెడియన్ విలన్ గా మారడానికి మధ్య ఎలాంటి పాత్రలు వేశారు ఆయన ప్రయాణం ఎలా సాగింది? సాగుతుంది అనే వివరాలు తెలుసుకుందాం…

మొదటగా కమెడియన్ గా కెరీర్ ను ప్రారంభించిన సునీల్ ఆ తర్వాత తన లక్ ను పరీక్షించుకున్నాడు. ఏకంగా హీరోగా అవతారం ఎత్తి పాత్రలో లీనమై పోయాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను సంపాదించిపెట్టింది. కానీ ఈ సినిమా తర్వాత ఎలాంటి ఆఫర్లు రాలేదు. అందుకే హీరో నుంచి మళ్లీ తన ప్రయాణం మార్చాడు. కమెడియన్ గానే పలు సినిమాల్లో నటించారు సునీల్. ఆ తర్వాత సడన్ గా విలన్ అవతారం ఎత్తారు. ఇక విలన్ పాత్రల్లో అనుకోని విధంగా గుర్తింపు పొంది అంచెలంచెలుగా ఎదుగుతున్నారు.

ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా చేసి మంచి గుర్తింపు సంపాదించిన సునీల్ ఒకటి రెండు సినిమాల్లో హీరోగా నటించి ప్రస్తుతం విలన్ గా కొనసాగుతున్నారు. ముఖ్యంగా పుష్ప సినిమాలో ఈయన పాత్ర చాలా అద్భుతం అని చెప్పాలి. అద్భుతమైన నటనను కనబరిచి ఎనలేని గుర్తింపు పొందారు. ఈ సినిమాలో సునీల్ విలనిజం చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఒకప్పుడు ఏ ఫేస్ ను చూసి నవ్వారో.. ఇప్పుడు అదే ఫేస్ ను చూసి భయపడుతున్నారు నెటిజన్లు. నవ్వించిన నటుడు భయపెట్టగలడు, ఏడిపించగలడు, విలనిజం చూపించగలడు అని నిరూపించాడు ఈ స్టార్ కమెడియన్. ముఖ్యంగా తమిళ్ స్టార్ హీరోలకు విలన్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు కూడా సునీల్ అవడం గమనార్హం.

ప్రస్తుతం సునీల్ సుధీర్ బాబు నటిస్తున్న హరోం హర అనే సినిమాలో కూడా విలన్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. జ్ఞాన సాగర్ దర్శకత్వంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్న సినిమాలో సునీల్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఓ పోస్టర్ కూడా వచ్చింది. దీనికి ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. పోస్టర్ లో సునీల్ పక్కన గన్స్, బుల్లెట్స్ తో కనిపించారు. ఇలా కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ హీరోగా ఆ తర్వాత విలన్ గా మెప్పిస్తున్నారు.