spot_img
HomeEventsBig Boss 6: బిగ్ బాస్ 6 టెలికాస్ట్ తేదీ మరియు టైమింగ్స్

Big Boss 6: బిగ్ బాస్ 6 టెలికాస్ట్ తేదీ మరియు టైమింగ్స్

Bigg Boss 6 Telecast Date: తెలుగు బుల్లితెర సంచలనం బిగ్ బాస్ సీసన్ 6 అతి త్వరలోనే ప్రసారం అవ్వబోతుంది అంటూ ఇటీవలే ప్రోమోస్ కూడా విడుదల చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇప్పటి వరుకు ప్రసారమైన 5 సీసన్స్ బంపర్ హిట్ అవ్వడం తో ఇప్పుడు ఆరవ సీసన్ పై భయంకరమైన అంచనాలు ఏర్పడ్డాయి..ఆ అంచనాలకు తగ్గట్టుగానే కనివిని ఎరుగని రీతిలో, కంటెస్టెంట్స్ గా ఎంతో మంది సెలెబ్రిటీలు మరియు వాళ్ళు హౌస్ లో ఆడేందుకు ఎన్నో ఆసక్తికరమైన టాస్కులతో బిగ్ బాస్ సీసన్ 6 రెడీ అయిపోయింది. దీనికి సంబంధించిన టీజర్ అయితే విడుదల చేసేసారు కానీ, ఏ తేదీ నుండి ప్రసారం అవుతుందో, ఏ టైమింగ్స్ లో వస్తుందో అనే విషయం మాత్రం ఇప్పటి వరుకు ప్రకటించలేదు.

Big Boss 6
Big Boss 6

Also Read: Poshan Abhiyaan: దేశ ప్రజలకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించే పనిలో ప్రధానమంత్రి మోడీ

అయితే అందుతున్న లేటెస్ట్ సమాచారం ఏమిటి అంటే ఈ షో వచ్చే నెల సెప్టెంబర్ 4 వ తేదీ ఆదివారం నాడు ఘనంగా ప్రారంభం అవ్వబోతుంది. సాయంత్రం 6 గంటలకు ప్రారంభం అయ్యే ఈ షో రాత్రి పది గంటల వరుకు కొనసాగుతుంది. ఆరోజు కంటెస్టెంట్స్ ని పరిచయం చేసి హౌస్ లోకి పంపుతారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ షో ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలిసే ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఈ సీసన్ లో ఉన్న ప్రత్యేకతలు ముందుగా మాట్లాడుకోవాల్సి వస్తే ఈ సీసన్ లో సెలెబ్రిటీలతో పాటు సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారు కూడా ఒక నలుగురు పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ 2 లో కూడా ఇలాగె చేసారు.

Big Boss 6  contestents
Big Boss 6 contestents

Also Read: Sreeja’s daughter’s sensational post: సంచలనం రేపుతున్న శ్రీజా కూతురు ఇంస్టాగ్రామ్ పోస్ట్..విడాకుల విషయం నిజమేనా?

సంజన, గణేష్ మరియు నూతన్ నాయుడు వంటి వారు ఈ షో లో సామాన్యులుగా పరిచయమై సెలెబ్రిటీలు అయ్యారు. నూతన్ నాయుడు కి అయితే ఆయనకి వచ్చిన పాపులారిటీ కి సినిమాలలో కూడా అవకాశాలు వచ్చాయి. మరి ఈసారి బిగ్ బాస్ షో లో సామాన్యులు ఆ స్థాయి పాపులారిటీ ని దక్కించుకుంటారో లేదో చూడాలి. ఇక ఈ షో లో పాల్గొనే సెలెబ్రిటీల లిస్ట్ గత కొంత కాలం నుండి సోషల్ మీడియా లో తిరుగుతూనే ఉంది. ఆ లిస్ట్ లో యాంకర్ ఉదయభాను , యాంకర్ వర్షిణి వంటి వారి పేర్లు కూడా ఉన్నాయి. మరి ఈ లిస్ట్ లో ఉన్న సెలెబ్రిటీలు అందరూ బిగ్ బాస్ లో పాల్గొనబోతున్నారా అనే విషయం తెలియాలంటే సెప్టెంబర్ 4 వరుకు వేచి చూడాల్సిందే.

Bigg  boss host Nagarjuna
Bigg boss host Nagarjuna

Also Read: Karthikeya 2- Bollywood: కార్తికేయ 2కి హిందీ జనం నీరాజనం.. తేలిపోయిన అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్.. ఆశ్చర్యపోతున్న బాలీవుడ్ !

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version