Suman Shetty to enter Bigg Boss House: ఈ ఆదివారం సాయంత్రం 7 గంటలకు బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) గ్రాండ్ లాంచ్ జరగబోతుంది. ఎన్నడూ లేని విధంగా ఈసారి సామాన్యులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపే ప్రక్రియ లో భాగంగా అగ్నిపరీక్ష షో ద్వారా 6 మంది సామాన్యులకు పంపబోతున్నారు. వాళ్ళు ఎవరు ఏమిటి అనేది అగ్ని పరీక్ష షో ని చూస్తున్న వారికి ఈపాటికే అర్థం అయిపోయి ఉంటుంది . ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ లో సెలబ్రిటీ కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా దాదాపుగా ఫైనల్ అయిపోయింది. అందులో కచ్చితంగా గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో కనిపించే మొట్టమొదటి కంటెస్టెంట్ సుమన్ శెట్టి(Suman Shetty). కమెడియన్ గా ఒకప్పుడు టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కనిపించిన ఈయన ఇప్పుడు బిగ్ బాస్ 9 లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టబోతున్నాడు. ఇప్పటికే ఆయనకు సంబంధించిన AV ని కూడా షూట్ చేశారట బిగ్ బాస్ టీం.
అయితే సుమన్ శెట్టి ఒకప్పుడు టాప్ కమెడియన్స్ లో ఒకరు కానీ ఇప్పుడు మాత్రం ఫేడ్ అవుట్ అయిపోయిన కమెడియన్ అనొచ్చు. ఒక్కటంటే ఒక్క సినిమాలో కూడా ఈమధ్య కాలం లో ఆయన కనిపించలేదు. అసలు ఎక్కడ ఉన్నాడు?, ఏమి చేస్తున్నాడు అనే అవగాహనా కూడా ఎవరికీ లేదు. అయినప్పటికీ కూడా బిగ్ బాస్ టీం ఆయనకు భారీగానే రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారట. ఒక్కో వారానికి గాను ఆయనకు లక్షా 75 వేల రూపాయిలు ఇవ్వబోతున్నారట. అంటే హౌస్ లో ఆయన ఎన్ని వారాలు కొనసాగితే, అన్ని లక్షా 75 వేల రూపాయిలు వస్తాయి అన్నమాట. అయితే సుమన్ శెట్టి మొదటి ఎపిసోడ్ నుండే తనదనైనా మార్కుని చూపించే ప్రయత్నం చేయాలి. ఆడియన్స్ తో ఆయనకు దూరం పెరిగి చాలా కాలమే అయ్యింది. కాబట్టి సుమన్ శెట్టి సరిగా పెర్ఫార్మన్స్ హౌస్ లో ఇవ్వలేకపోతే మొదటి రెండు మూడు వారాల్లోనే ఆయన ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అలా జరగకుండా ఉండాలంటే సుమన్ శెట్టి సీజన్ 7 లో శివాజీ లాగ తనదైన మార్కు ని మొదటి ఎపిసోడ్ నుండే చూపించాలి. వయస్సులో కూడా సుమన్ శెట్టి హౌస్ లోకి రాబోతున్న కంటెస్టెంట్స్ అందరికంటే పెద్ద. శరీరం కూడా టాస్కులు హుషారుగా ఆడేందుకు సహకరించదు. పోనీ ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఇవ్వగలడా అంటే అవినాష్ లాగా సహజంగా కామెడీ పండించే టాలెంట్ లేదు, స్క్రిప్ట్ ఉంటేనే కామెడీ పండించగలడు. మరి ఈయన బిగ్ బాస్ హౌస్ లో ఎన్ని రోజులు నెగ్గుకురాగలడో చూడాలి. అక్కడేమో సామాన్యులు కూడా పటాకాలు లాగా ఉన్నారు, వాళ్ళని తట్టుకోవడమంటే కచ్చితంగా సుమన్ శెట్టి కి ఒక అగ్నిపరీక్ష లాంటిది. చూడాలి మరి ఆయన ఎలా నెగ్గుకురాగలడు అనేది.