https://oktelugu.com/

AP teachers Concern : ఉపాధ్యాయులను  వదిలించుకొనే జగన్ కుట్ర..

AP teachers Concern  : పాఠశాల విద్యను పేదలకు దూరం చేసే కుట్రకు వైసీపీ ప్రభుత్వం తెర తీసిందని జనసేన ఆరోపించింది. ఉపాధ్యాయులను వదిలించుకొని ప్రభుత్వ స్కూల్స్ బైజూస్ లాంటి ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ఆలోచన చేస్తోందని జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. దీనికి సంస్కరణలు, సాంకేతికత వినియోగం లాంటి ముసుగు వేస్తోందన్నారు. జగన్ రెడ్డి పాలనలోకి వచ్చినప్పటి నుంచి పేదలకు ఉచిత విద్య, దానిపై చేసే ఖర్చులను తగ్గించాలనే విధానంతో ముందుకు వెళ్తున్నారని […]

Written By:
  • NARESH
  • , Updated On : August 17, 2022 / 01:46 PM IST
    Follow us on

    AP teachers Concern  : పాఠశాల విద్యను పేదలకు దూరం చేసే కుట్రకు వైసీపీ ప్రభుత్వం తెర తీసిందని జనసేన ఆరోపించింది. ఉపాధ్యాయులను వదిలించుకొని ప్రభుత్వ స్కూల్స్ బైజూస్ లాంటి ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ఆలోచన చేస్తోందని జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. దీనికి సంస్కరణలు, సాంకేతికత వినియోగం లాంటి ముసుగు వేస్తోందన్నారు. జగన్ రెడ్డి పాలనలోకి వచ్చినప్పటి నుంచి పేదలకు ఉచిత విద్య, దానిపై చేసే ఖర్చులను తగ్గించాలనే విధానంతో ముందుకు వెళ్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే ఉపాధ్యాయులను వేధించే చర్యలకు పాల్పడుతున్నారు. బోధన విధులకు దూరం చేస్తూ అందుకు సంబంధం లేని పనులకు బాధ్యులను చేస్తున్నారు.

    ఉపాధ్యాయులతో మరుగు దొడ్ల ఫోటోలు తీయించడం, మద్యం షాపుల దగ్గర డ్యూటీలు వేయడం, కోడి గుడ్ల లెక్కలు రాయడం లాంటివి చేయిస్తూ పిల్లలకు పాఠాలు చెప్పేందుకు సమయం తగ్గిస్తున్నారు. ఇప్పుడు ఉపాధ్యాయుల హాజరుకి సంబంధించి ఫేస్ రికగ్నిషన్ యాప్ అని గందరగోళపరుస్తున్నారని జనసేన ఆరోపిస్తోంది. ఇంటి గడప దాటి సచివాలయానికి వెళ్లని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కూడా ఉపాధ్యాయుల హాజరులో నిమిషం ఆలస్యమైతే ఆబ్సెంట్ అంటూ ఉత్తర్వులు ఇప్పించడం హాస్యాస్పదంగా ఉందని  ఆయన ఎప్పుడూ సచివాలయానికి వెళ్లకపోవడం వల్ల అభివృద్ధి పటంలో ఏపీ ఆబ్సెంట్ అయిపోయిందని నాదెండ్ల ఎద్దేవా చేశారు.

    వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులను వేధిస్తున్న తీరునీ, తమకు దక్కాల్సిన జీతభత్యాల గురించి, ఎన్నికల్లో హామీ ఇచ్చిన సీపీఎస్ రద్దు గురించి టీచర్లు ప్రశ్నిస్తున్నారు కాబట్టే వారిని ప్రభుత్వం వేధిస్తోందని నాదెండ్ల ఆరోపించారు. బోధనకు దూరం చేసి, హాజరు పేరుతో బలవంతంగా సెలవులు పెట్టించి ప్రజలకు ఉపాధ్యాయులను శత్రువులుగా చూపించాలని వైసీపీ నిర్ణయించుకొంది. ఇప్పటికే ప్రాథమిక పాఠశాలలను మూసివేసే పని మొదలుపెట్టారు. ఆ క్రమంలో ఉపాధ్యాయులను వేధించి వదిలించుకొని.. విద్యాలయాలను బైజూస్ లాంటి తమకు దగ్గరైన సంస్థలకు అప్పగించే కుట్రతో వైసీపీ ఉందని ఆరోపించారు.. ఈ చర్యలను జనసేన పార్టీ ఖండిస్తుందన్నారు. ఉపాధ్యాయులకు బోధన విధులకు మాత్రమే పరిమితం చేయాలి. అర్థం లేని యాప్స్, ఫోటోలు తీయడం లాంటి పనులను పక్కనపెట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై పోరుబాట పట్టడానికి.. ఉపాధ్యాయులకు అండగా నిలవడానికి జనసేన సిద్ధమైంది