Yamadonga Re Release: టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ ప్రస్తుతం ఏ రేంజ్ లో కొనసాగుతుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఈ ట్రెండ్ లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), మహేష్ బాబు(Super Star Mahesh Babu) పాత సినిమాలు విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. మధ్యలో అల్లు అర్జున్, ఎన్టీఆర్(Junior NTR), రామ్ చరణ్ సినిమాలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ, రెగ్యులర్ గా మాత్రం ఈ ఇద్దరి హీరోలే టాప్ స్థానం లో ఉన్నారు. ఇకపోతే ఎన్టీఆర్ నటించిన ‘సింహాద్రి’ చిత్రం 2023 వ సంవత్సరం లో భారీ అంచనాల విడుదలైన ఈ చిత్రం ఆల్ టైం రికార్డు ని అయితే క్రియేట్ చేయలేకపోయింది కానీ, నాలుగు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి టాప్ 5 లో నిల్చింది. ఈ చిత్రం తర్వాత మరో ఎన్టీఆర్ పాత సినిమా రీ రిలీజ్ కి సిద్ధం అవ్వలేదు.
Also Read: కాలేజీలో అందంగా లేవంటూ కామెంట్స్ చేసేవారు.. కానీ ప్రస్తుతం ఇండస్ట్రీని ఊపేస్తున్న హీరోయిన్..
అయితే వచ్చే నెల 20న ఆయన పుట్టినరోజు కావడంతో ‘యమదొంగ'(Yamadonga Movie) చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 4K రీస్టోరేషన్ పూర్తి అయ్యింది. ఇండియా లో 4K లో విదేశాల్లో 8K క్వాలిటీ తో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాతో ఎలా అయినా ఆల్ టైం రికార్డు ని నెలకొల్పాలనే కసితో ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చిత్రానికి మొదటి రోజు 8 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లతో ఆల్ టైం రికార్డు డే1 నమోదైంది. అదే విధంగా ‘మురారి’ చిత్రం ఫుల్ రన్ లో 9 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇదే ఇప్పుడు ఫుల్ రన్ లో ఆల్ టైం రికార్డుని నెలకొల్పిన చిత్రం గా చలామణి అవుతుంది.
ఈ రెండు రికార్డ్స్ ని ఎన్టీఆర్ ‘యమదొంగ’ చిత్రం బ్రేక్ చేస్తుందా లేదా అనేది చూడాలి. ఆంధ్ర ప్రదేశ్, సీడెడ్, ఓవర్సీస్ ప్రాంతాల్లో కచ్చితంగా ఈ చిత్రానికి రికార్డ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ మిగిలిన నైజాం లో మాత్రం రికార్డు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ ఎన్టీఆర్ కి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లకు ఉన్నంత క్రేజ్ లేదు. సింహాద్రి చిత్రానికి కూడా నైజాం ప్రాంతంలో చాలా తక్కువ వసూళ్లు వచ్చాయి. రీ రిలీజ్ చిత్రాలలో అత్యధిక గ్రాస్ వచ్చేది నైజాం ప్రాంతం నుండే. కాబట్టి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ఆల్ టైం రికార్డుని నెలకొల్పడం అంత తేలికైన విషయం కాదని అంటున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ కి వెళ్లి ఆగుతుంది అనేది. ఈ సినిమాకు ప్రత్యేకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.
Also Read: తెలుగులో చేసిన ఒకే ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. క్రేజ్ మాత్రం ఓ రేంజ్ లో.. ఈ బ్యూటీ ఎవరంటే..