Divya Bharati : హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో ఏదో ఒక ఇంటర్వ్యూలో తాము కెరియర్ స్టార్టింగ్ లో ఎదుర్కొన్న కష్టాల గురించి అందరితో పంచుకుంటూ ఉంటారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా ఈ కోవకు చెందిందే.ఈమెకు కాలేజీ చదువుతున్న రోజుల్లో అందంగా లేవంటూ బాడీ శేమింగ్ కామెంట్స్ చేసేవారు. కానీ ప్రస్తుతం మాత్రం తన అందంతో సౌత్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో అందరిని ఆశ్చర్యపరుస్తుంది ఈ బ్యూటీ. ఇప్పటివరకు కన్నడ సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో అలరించిన ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి రెడీగా ఉంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అందాల బీభత్సం సృష్టిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా. తెలుగులో ఈమె ఇప్పటివరకు ఒక సినిమా కూడా చేయకుండానే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఈమె కాలేజీ చదువుతున్న రోజుల్లో అందంగా లేవంటూ బాడీ షెమింగ్ కామెంట్స్ చేసేవారు. ఈ హీరోయిన్ పేరు దివ్యభారతి. ఈరోజుల్లో ఈమె పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఈమె మంచి గుర్తింపుని తెచ్చుకున్న తోపు హీరోయిన్. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది. దివ్యభారతి మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ హీరోగా నటించిన బ్యాచిలర్ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఊహించని రొమాంటిక్ సీన్లతో మొదటి సినిమాలోనే రెచ్చిపోయి నటించింది. ఈ క్రమంలో ఈ బ్యూటీ పేరు సినిమా ఇండస్ట్రీలో బాగా వినిపించింది. మొదటి సినిమాతోనే హీరోయిన్ దివ్యభారతకి ఫాలోయింగ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ఈ క్రమంలో కన్నడ సినిమా ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలను అందుకుంది. దివ్యభారతి జనవరి 28, 1992లో జన్మించింది. కాలేజీ చదువుతున్న రోజుల్లోనే దివ్యభారతికి నటనపై చాలా ఆసక్తి ఉండేది. తన చదువు పూర్తయిన వెంటనే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ వచ్చింది. బ్యాచిలర్ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యి విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. అలాగే దివ్యభారతి మదిల్ మేల్ కాదల్, కింగ్ స్టన్, ఆశై మహారాజా వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం ఈ చిన్నది సుడిగాలి సుదీర్ కు జోడిగా గోటు చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది దివ్యభారతి. కొన్ని నెలల నుంచి గోటు సినిమా షూటింగ్ సెలవేగంగా జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.
Also Read : తెలుగులో చేసిన ఒకే ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. క్రేజ్ మాత్రం ఓ రేంజ్ లో.. ఈ బ్యూటీ ఎవరంటే..