Star Heroine : ప్రస్తుతం మనం చెప్పుకోబోయే హీరోయిన్ తెలుగులో కేవలం ఒకే ఒక్క సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అట్టర్ ప్లాప్. సినిమాలలో అవకాశం వస్తే ఆ పాత్ర కోసం హీరోయిన్లు ఎంత రిస్క్ అయినా ఒప్పుకుంటారు. అయితే సినిమా ఇండస్ట్రీలోని హీరోయిన్లు తమ ఫిట్నెస్ కు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అందరికీ తెలిసిందే. కథకు తగ్గట్టుగా హీరోయిన్లు తమకు తాము మార్చుకుంటూ నటనతో ప్రేక్షకులను అలరిస్తారు. ప్రతి సినిమాకు కూడా వేరియేషన్స్ ను చూపిస్తూ సినిమాలు చేస్తూ ఉంటారు. ఆ సినిమాలోని పాతలను బట్టి ఎలా కావాలంటే అలా తమ శరీరాన్ని మార్చుకుంటారు. ముఖ్యంగా చాలెంజింగ్ రోల్స్ ఉన్న సినిమాలలో నటించి హీరోలకు తాము కూడా ఏమాత్రం తక్కువ కాదు అంటూ నిరూపించుకుంటారు. ప్రస్తుతం ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ స్లిమ్ గా మారి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఒకప్పుడు బొద్దుగా ఉన్న మీ ముద్దుగుమ్మ ప్రస్తుతం సన్నజాజిలాగా మారిపోయి అందరికి షాక్ ఇస్తుంది. ఈమె పేరు రజిషా విజయం. కెరియర్ ప్రారంభంలో టీవీ యాంకర్ గా పని చేసిన ఆ తర్వాత హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది.
Also Read: విడాకుల బాటలో నజ్రియా, ఫహద్ ఫాజిల్..? సంచలనం రేపుతున్న లేటెస్ట్ పోస్ట్!
మొదట్లో మలయాళ సినిమా రంగంలో పనిచేసింది. రజిష జులై 15, 1991లో కూలికోడు జిల్లా కాలికట్లో పుట్టింది. రజిష నోయిడా లోని కమిటీ యూనివర్సిటీ నుంచి మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో డిగ్రీని పూర్తి చేసింది. అనురాగ కరెక్కిన బెల్లం అనే సినిమాతో 2016లో మలయాళ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఆ తర్వాత రజిష జూన్, స్టాండ్ అప్, ఫైనల్స్ వంటి సినిమాలలో నటించి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది.
నటనలో ఈమె సహజత్వం, వివిధ పాత్రలను పోషించే ఆమె సామర్థ్యం ఆమెకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. తమిళ్ తో పాటు రజిష తెలుగు సినిమాలలో కూడా నటించింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. రజిష టీవీలో హోస్ట్ పనిచేస్తున్న సమయంలో మలయాళమ్ ఇండస్ట్రీలో పలు షోలలో కూడా పాల్గొంది. విభిన్న కథలో ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ మధ్యకాలంలో కాస్త బొద్దుగా మారిన రజిత ప్రస్తుతం స్లిమ్ గా మారి అందరికీ షాక్కు గురి చేసింది
View this post on Instagram