Directors : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియా బాట పట్టడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడిని తమ అభిమానులుగా మార్చుకుంటున్నారు. ప్రభాస్(Prabhas), రామ్ చరణ్(Ram Charan), జూనియర్ ఎన్టీఆర్(Jr NTR), అల్లు అర్జున్(Allu Arjun) లాంటి నటులు ఇప్పటికే తమ స్టామినాను చూపిస్తూ యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే మన హీరోలతో సినిమాలు చేయడానికి ఇండియాలో ఉన్న ప్రముఖ దర్శకులందరు క్యూ కడుతూ ఉండటం విశేషం…ముఖ్యంగా తమిళ్ సినిమా ఇండస్ట్రీలోని దర్శకులైతే మన హీరోల మీదనే ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికీ అట్లీ అల్లు అర్జున్ తో ఒక భారీ సినిమాను తెరకెక్కించడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ తో నెల్సన్ ఒక యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాని తెరకెక్కించి భారీ రికార్డులను కొల్లగొట్టాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈయన రజనీకాంత్ తో ‘జైలర్ 2’ (Jailer 2)అనే సినిమాని చేస్తున్నాడు. గతంలో ఈయన చేసిన ‘జైలర్’ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడంతో ఇప్పుడు జైలర్ 2 సినిమా మీద కూడా భారీ అంచనాలైతే ఏర్పడ్డాయి. ఇక అదే ఊపులో ఎన్టీఆర్ తో కూడా భారీ సినిమాను చేసి రికార్డులను కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : హీరోలను స్మగ్లర్లు, గ్యాంగ్ స్టర్స్, దొంగలుగా చూపించి సభ్య సమాజానికి దర్శకులు ఏం మేసేజ్ ఇస్తున్నారు..?
ఇక ప్రభాస్, రామ్ చరణ్ తో కూడా పలువురు తమిళ దర్శకులు చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది… మరి మన హీరోలు తెలుగు దర్శకులను కాదని తమిళ్ దర్శకుల వెంట ఎందుకు పడుతున్నారు. మన వాళ్ళ దగ్గర మంచి టాలెంట్ ఉన్నప్పటికి వాళ్లని గుర్తించడంలో మాత్రం మన హీరోలు కొంతవరకు వెనుకబడిపోతున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది రోజురోజుకీ టాప్ రేంజ్ లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి తమిళ్ దర్శకులు సైతం మన హీరోలతో సినిమాలు చేస్తేనే భారీ రికార్డులను కొల్లగొట్టొచ్చని ఒక స్వార్థపూరిత ఉద్దేశ్యంతో మన వాళ్ళతో సినిమాలు చేస్తున్నారు. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరోకి పాన్ ఇండియాలో మంచి మార్కెట్ అయితే లేదు.
ఇక మన హీరోలు అయితేనే వాళ్ళ కథలకు న్యాయం జరుగుతుందనే ఒకే ఒక ఉద్దేశ్యంతో వాళ్లు సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. దాంతో తెలుగులో తమిళ్ దర్శకుల హవా ఎక్కువ అవుతుంది అంటూ కొందరు సినిమా మేధావులు వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
Also Read : సినిమా ఇండస్ట్రీ లో కొత్త దర్శకులకు సినిమాలను సెట్ చేస్తున్న ఆ స్టార్ రైటర్ ఎవరో తెలుసా..?