directors : సినిమా చూసే ప్రేక్షకుడి మీద ఆ సినిమాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే చాలామంది ప్రేక్షకులు ఒక సినిమా చూసి ఆ హీరో ఎలాంటి హావభావాలతో ఉన్నాడో అలాంటి హావా భావాలను బయట అనుకరిస్తూ తిరుగుతుంటారు. అలాగే తన హెయిర్ స్టైల్ దగ్గర నుంచి తన డ్రెస్సింగ్ స్టైల్ గాని తన వాకింగ్ స్టైల్ గాని అన్ని అతన్ని ఫాలో అవుతూ ఉంటాడు… ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న మన హీరోలను అనుకరిస్తూ ఉంటారు… ఇక ఇలాంటి సందర్భంలోనే దర్శకుడు స్మగ్లర్లను, దొంగలను హీరోలుగా చూపిస్తూ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక దీని ప్రభావం జనాల మీద ఉంటుందా అంటూ మరి కొంతమంది కామెంట్లను వ్యక్తం చేస్తున్నప్పటికి పుష్ప సినిమా రిలీజ్ అయినప్పుడు ఇందులో హీరో స్మగ్లర్ గా ఉంటూ కొంతమందిని చంపుతూ తను పైకి ఎదుగుతూ ఉంటాడు.
ఇక ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు డిల్లీ లో ఒక కుర్రాడు ఒక వ్యక్తిని చంపి నేను కూడా పుష్ప లాగే గ్యాంగ్ స్టర్ అవ్వాలనుకుంటున్నాను అంటూ సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా జనాల వెన్నులో వణుకు పుట్టిందనే చెప్పాలి. అంటే సినిమా ప్రభావం అనేది ప్రేక్షకుల్లో ఎంత డీప్ గా నాటుకుపోతుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు…
మరి మంచి సినిమాలను చేసి జనానికి మంచి మెసేజ్ లను ఇవ్వచ్చు కదా అంటూ కొంతమంది అభిప్రాయాలను తెలియజేస్తున్నప్పటికి మంచి సినిమాలకి ప్రస్తుతం ప్రేక్షకుల నుంచి ఆదరణ రావడం లేదనే ఉద్దేశ్యంతోనే మారుతున్న ట్రెండుకు తగ్గట్టుగా దర్శకులు ఇలాంటి కథలను ఎంచుకొని సినిమాలు గా చేస్తున్నామంటూ ఒక క్లారిటీ అయితే ఇస్తున్నారు. మరి వాళ్లకు ఒక క్లారిటీ ఉన్నప్పటికి జనానికి ఈ సినిమాల వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది అనేది కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది…ఇక ప్రస్తుతం వస్తున్న సినిమాలు కూడా సమాజానికి వ్యతిరేకంగా ఉండటమే కాకుండా హీరో క్యారెక్టర్ అనేవాడు విలన్ లక్షణాలతో ఉండడం అనేది కూడా ఇప్పుడు ఒక ట్రెండ్ గా మారింది.
పుష్ప, కేజిఎఫ్, అనిమల్ అర్జున్ రెడ్డి, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడమే కాకుండా సక్సెస్ ఫుల్ సినిమాలుగా మారుతున్నాయి. ఇలాంటి సినిమాల్లో కూడా హీరోల క్యారెక్టరైజైషన్ చాలా నెగెటివ్ గా ఉండటం వల్ల సినిమా చూసే ప్రేక్షకులు కూడా హీరోల్లో తమను తాము ఊహించుకొని సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే అవకాశాలు ఉంటాయి అంటూ మరికొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా వీటికి పరిష్కారం చెప్పాల్సిన సమయమైతే ఆసన్నమైంది. ఒక సినిమాని సినిమా లాగా చూడాలి తప్ప దాన్ని ఓన్ చేసుకొని మనం కూడా హీరోలాగా వ్యవహరించాలి అనుకోవడం తప్పు అవుతుంది. సినిమా ఇండస్ట్రీలోని పెద్దల దగ్గర ఈ విషయం మీద స్పందిస్తూ ఠాగూర్ లాంటి మంచి సినిమాను చూసి ఎంతమంది లంచాలు తీసుకోకుండా మంచి వాళ్ళు గా మారిపోయారు.
అలాగే భారతీయుడు లాంటి సినిమాను చూసి ఎంతమందికి దేశం మీద ప్రేమ పెరిగింది అంటూ వాళ్లు వాళ్లకు సరిపడే విధంగా సమాధానం చెబుతున్నారు. నిజానికి మంచి సినిమాను చూసిన దాని కంటే ఒక నెగెటివ్ షేడ్స్ ఉన్న హీరో పాత్రను చూసిన ప్రేక్షకుడు దానికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతాడు. కాబట్టి అలాంటి సినిమాలను చేయడం కొంతవరకు తగ్గిస్తే మంచిదనే ధోరణిలో కొంతమంది ట్రెడ్ పండితులు వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ఇక ఏది ఏమైనా కూడా మంచి చెడు అనేది ప్రేక్షకులు చూసే దృష్టి కోణాన్ని బట్టి ఉంటుంది. కానీ ఏ సినిమా కూడా వాళ్ల మీద ప్రభావం చూపించదని కొంతమంది సైకలాజిస్టు లు కూడా వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…