Rajamouli and Mahesh Babu : యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు రాజమౌళి వైపే చూస్తున్నారు. ఒక సినిమాతో వండర్స్ ని క్రియేట్ చేయొచ్చు అని ప్రూవ్ చేసిన దర్శకుడు కూడా తనే కావడం విశేషం. ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా రాజమౌళి చేసే సినిమాల స్టైల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం షేక్ అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు. ఇక ఎవరు ఎన్ని సక్సెస్ లను సాధించిన అత్యంత గొప్ప గుర్తింపును తెచ్చుకున్నా కూడా రాజమౌళికి ఉన్న పేరు ప్రఖ్యాతలు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. తెలుగు సినిమా స్థాయిని అమాంతం ఇండియా లెవెల్ కి తీసుకెళ్లిన దర్శకుడు కూడా తనే కావడం విశేషం… ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకోవాలనే ఉద్దేశ్యం తో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాలతో వరస విజయాన్ని సాధించి మంచి గుర్తింపును రెట్టింపు చేసుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు కొత్త లుక్ లో ఒక ఫోటో అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. నిజానికి రాజమౌళి కావాలనే ఆ లుక్ లోకి మహేష్ బాబును మార్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఇందులో మహేష్ బాబు డ్యూయల్ రోల్ లో నటించబోతున్నాడనే వార్తలైతే ఇంతకుముందు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.
Also Read : రాజమౌళి మహేష్ బాబు కాంబోలో వస్తున్న సినిమాలో గెస్ట్ గా కనిపించనున్న హాలీవుడ్ స్టార్ హీరో…
దానికోసమే ఈ సెకండ్ లుక్ ను కూడా ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే మహేష్ బాబుతో రాజమౌళి ఏదో భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాడు అంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది సినిమా మేధావులు సైతం అభిప్రాయ పడుతున్నారు. ఇక ఏది ఏమైనా మహేష్ బాబు ఈ సినిమాలో అడ్వెంచర్స్ చేసి తన కంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత డైరెక్ట్ గా ఆయనకు హాలీవుడ్ లో కూడా భారీ అవకాశాలు వస్తాయి అంటూ మరి కొంతమంది కామెంట్లు చేయడం విశేషం… మరి ఒకేసారి రాజమౌళి మహేష్ బాబు ఇద్దరు పాన్ వరల్డ్ లెవెల్లో దూసుకుపోవడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.
మరి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దర్శకుల పక్కన రాజమౌళి నిలబడతాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…ఇక రాజమౌళి మాత్రం తన ఫేవరెట్ డైరెక్టర్ అయిన జేమ్స్ కామెరూన్ (James Cameroon) పక్కన తన పేరును నిలుపుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు…
Also Read : రాజమౌళి మహేష్ బాబు కి హాలీవుడ్ రేంజ్ సక్సెస్ ఇస్తాడా..? నిజంగా అది సాధ్యం అవుతుందా..?