_Rajamouli
Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ రాజమౌళి(Rajamouli)… ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఏకైక దర్శకుడిగా కూడా పేరు సంపాదించుకున్నాడు…ఇప్పటివరకు ఆయన 12 సినిమాలు చేస్తే 12 సినిమాలు సైతం సూపర్ సక్సెస్ గా నిలవడమే కాకుండా ఆయన సాధించిన ప్రతి విజయం ఒక్కో మెట్టు పైకి ఎక్కిస్తూ అతన్ని ముందుకు తీసుకెళుతున్నాయి… ఇక ఇదిలా ఉంటే ఆయన ఎంటైర్ కెరియర్ లో ఆయన సక్సెస్ ఫుల్ గా నిలవడానికి తన భార్య అయిన రమా రాజమౌళి (Rama Rajamouli)కారణమని ఆయన పలు సందర్భాల్లో తెలియజేశాడు. నిజానికి రాజమౌళి కంటే ఐదు సంవత్సరాలు పెద్దదైన రమా ను ఆయన ఎందుకు పెళ్లి చేసుకున్నాడనే అనుమానాలు అందరి లో కలుగుతాయి. కానీ రాజమౌళి మాత్రం వాళ్ళిద్దరి అభిప్రాయాలు కలవడం వల్లనే తను ఆమెని పెళ్లి చేసుకున్నానని తన విజయానికి మూల కారణం తన భార్య అని చెబుతూ ఉంటారు. మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ ఈ రేంజ్ లో ఉన్నాడు అంటే దానికి తన వైఫ్ కూడా చాలా వరకు హెల్ప్ చేసిందనే చెప్పాలి.
Also Read: రాజశేఖర్, శంకర్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా అదేనా..? చేసుంటే పాన్ ఇండియన్ స్టార్ హీరో అయ్యేవాడు!
రాజమౌళికి బాగా బద్దకం ఉంటుందట. ఎప్పటికప్పుడు ఆమె రాజమౌళిని సినిమాల విషయంలో ముందుకు నెట్టూతూ ఉంటారట. అందువల్లే రాజమౌళి చాలా ఫాస్ట్ గా తన పనిని తాను చేసుకోవాలని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఒక రకంగా ఆయన సక్సెస్ లో ఆమె చాలా కీలక పాత్ర వహిస్తూ వచ్చిందనే చెప్పాలి.
ఇక ఏ రోజు కూడా రాజమౌళి తనకు సొంత కొడుకు లేడని బాధపడలేదట. ఎందుకు అంటే రమా కొడుకుని తన కొడుకుగా యాక్సెప్ట్ చేసి మరి తనతో ఇప్పటివరకు ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా బతుకుతున్నాడు అంటే నిజంగా రాజమౌళి గ్రేట్ అనే చెప్పాలి.
ప్రస్తుతం ఆయన వరల్డ్ సినిమా డైరెక్టర్ గా చేయడం ఒక్కటే తన లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక దాని కోసమే ఆయన అహర్నిశలు కష్టపడైన సరే దాన్ని సాధించుకోవాలి అనే దృఢ సంకల్పంతో ముందుకు సాగడం చూస్తున్న ప్రతి ఒక్క ఇండియన్ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు…ఇక ఏది ఏమైనా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి లాంటి ఒక గొప్ప దర్శకుడు లేడని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు…