అక్కినేని సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతీ అప్ డేట్ ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా సామ్ చేసిన పనికి అక్కినేని ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అక్కినేని కోడలుగా సమంత ప్రత్యేకమైన క్రేజ్ ను తెచ్చుకుంది. అయితే సమంత తన సోషల్ మీడియా అకౌంట్స్ నుండి తన పేరుకు ముందు ఉన్న ‘అక్కినేని’ పేరును తొలగించింది.
కారణం చైతు – సామ్ మధ్య జరిగిన గొడవా ? లేక, మరేదైనా కారణం ఉందా ? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. దాదాపు రెండు సంవత్సరాలు డేటింగ్ అనంతరం సమంతని నాగచైతన్య 2017లో వివాహం చేసుకున్నాడు. అప్పటి నుండి వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఇక పెళ్లైన వెంటనే తన సోషల్ మీడియా అకౌంట్స్ లో సమంత తన పేరు పక్కన ‘అక్కినేని’ అనే పేరును యాడ్ చేసుకుని తెగ మురిసిపోయింది.
తెలుగింటి కోడలుగా ప్రశంసలు అందుకుంది. పైగా అప్పటి నుంచి సమంత సినిమాల వేగం పెంచడం, దానికి తగ్గట్లుగానే ఆమె సక్సెస్ రేటు కూడా పెరగడంతో సామ్ కి తిరుగులేకుండా పోయింది. కానీ సడెన్ గా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ల నుంచి అక్కినేని అనే పేరును ఎందుకు తొలిగించిందో అని ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
చైతు – సామ్ దాంపత్య జీవితం సజావుగా సాగుతుందా ? లేదా ? అని సామ్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అయినా, సమంత తన పేరు పక్కన ఉన్న అక్కినేని అనే పదాన్ని తీసేసింది అంటే.. వ్యవహారం చాల దూరం వచ్చింది అనుకోవాలి. ఏమైనా వ్యక్తిగత కారణాలు ఉన్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం సమంత సినిమాల విషయానికి వస్తే.. గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే పాన్ ఇండియా సినిమా చేస్తోంది.