నిశ్చితార్థాలు పెళ్లి దాకా వెళ్లక మధ్యలోనే ఆగుతున్నాయి. జంటల్లో పొడచూపుతున్న అభిప్రాయ భేదాలతో పెళ్లి దాకా వెళ్లలేకపోతున్నాయి. దీంతో పలు జంటలు పెళ్లి పీటల వరకు వెళ్లడం లేదు. పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయని చెబుతుంటారు. అందుకే పెళ్లి దాకా చేరడం మామూలు విషయం కాదు. యువ జంటల్లో ఇంత జరుగుతున్నా పట్టించుకునే వారు కానరావడం లేదు. సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఇందుకు విరుద్దమేమీ కాదు. పెళ్లి పీటల నుంచి విడిపోయన వారు కూడా ఉండడం గమనార్హం.
కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న రష్మిక మందన నిశ్చితార్థం కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టితో ఫిక్స్ అయింది. కానీ అనుకోకుండా వీరు విడిపోవడం తెలిసిందే. ఏం జరిగిందో తెలియదు కానీ వీరి నిశ్చితార్థం రద్దు కావడం పెద్ద చర్చనీయాంశమే అయింది. బాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ ఎంగేజ్ మెంట్ కూడా భవ్య బిష్ణోయ్ తో నిర్ణయించారు. కానీ వీరి వివాహం కూడా పెళ్లి పీటల వరకు వెళ్లలేదు. ఇక్కడ కూడా ఏం జరిగిందో ఎవరికీ తెలియదు.
సినీ హీరో నాగార్జున తనయుడు అఖిల్ నిశ్చితార్థం శ్రీయ భూపాల్ తో 2016లో జరిగింది. వీరి పెళ్లి కూడా పీటల వరకు వెళ్లలేదు. మధ్యలోనే వద్దనుకున్నారు. గతంలో కూడా దివంగత హీరో ఉదయ్ కిరణ్, మెగాస్టార్ చిరంజీవి తనయ సుష్మతతో నిశ్చితార్థం జరిగినా వారి పెళ్లి కూడా కాలేదు.మధ్యలోనే విరమంచుకున్నారు. వీరి నిశ్చితార్థం 2003లో జరిగింది. అనివార్య కారణాల వల్ల రద్దయింది. దీంతో సుష్మిత విష్ణు ప్రసాద్ ను పెళ్లి చేసుకుంది. ఉదయ్ కిరణ్ విషితను తన భాగస్వామిగా చేసుకున్నారు.
తరుణ్, ఆర్తిఅగర్వాల్ సైతం ప్రేమించుకున్నారు. నువ్వులేక నేను లేను సినిమాలో కలిసి నటించారు. ఆ సమయంలో వీరి మధ్యప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకోవాలని భావించినా వారి ఆశలు నెరవేరలేదు. చెన్నై అందాల సుందరి త్రిష కూడా ఇదే కోవలోకి వస్తారు. త్రిష, వ్యాపార వేత్త అయిన వరుణ్ మానియన్ ప్రేమలో మునిగారు. షికార్లు చేశారు. పెళ్లి రోజు కూడా ప్రకటించారు. కానీ నటన విషయంలో గొడవలు రావడంతో ఇద్దరు విడిపోయారు. త్రిష సినిమాలతో బిజీగా ఉంటే వరుణ్ బిందు మాధవితో ప్రేమలో ఉన్నారు.
ఇక ప్రభుదేవా, నయనతార ప్రేమ కూడా కొంత కాలం సాగింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని భావించినా చివరికి విడిపోయారు. ఇప్పుడు ఎవరి దారి వారిదే.దీంతో ప్రేమలో పడినా అది కలకాలం వరకు నడిచే వారు తక్కువే. మధ్యలోనే వదిలేసేవారే ఎక్కువ. హన్సిక, శింబు ప్రేమ సైతం మధ్యలోనే ఆగిపోయింది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, శిల్పాశెట్టి సైతం గతంలో ప్రేమలో పడ్డారు. కానీ వారి ప్రేమ కూడా పెళ్లి వరకు వెళ్లలేకపోయింది