https://oktelugu.com/

ఈసారైనా ప్రదీప్ కోరికను ‘పవర్ స్టార్’ తీరుస్తాడా !

రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించిన ప్రదీప్ మాచిరాజు బుల్లితెర ప్రపంచంలో తన వాక్ చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకుంటూ స్టార్ యాంకర్ గా వెలుగుతున్నాడు. యాంకర్, యాక్టర్, టెలివిజన్ ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్న ప్రదీప్ తాజాగా ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ చిత్రంతో హీరోగా కూడా అవతారమెత్తాడు. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించి తోలి సినిమాతోనే విజయం అందించడంతో ప్రదీప్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. Also Read: రాజ్ తరుణ్ ‘పవర్ ప్లే’ ట్రైలర్ టాక్ ! […]

Written By:
  • admin
  • , Updated On : February 4, 2021 / 05:19 PM IST
    Follow us on


    రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించిన ప్రదీప్ మాచిరాజు బుల్లితెర ప్రపంచంలో తన వాక్ చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకుంటూ స్టార్ యాంకర్ గా వెలుగుతున్నాడు. యాంకర్, యాక్టర్, టెలివిజన్ ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్న ప్రదీప్ తాజాగా ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ చిత్రంతో హీరోగా కూడా అవతారమెత్తాడు. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించి తోలి సినిమాతోనే విజయం అందించడంతో ప్రదీప్ ఫుల్ జోష్ లో ఉన్నాడు.

    Also Read: రాజ్ తరుణ్ ‘పవర్ ప్లే’ ట్రైలర్ టాక్ !

    అదలా ఉండగా ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ ఛానల్ జీ తెలుగులో ప్రసారమయ్యే “కొంచెం టచ్ లో ఉంటె చెబుతా” షో ని ప్రదీప్ స్వయంగా ప్రొడ్యూస్ చేస్తూ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే నాలుగు సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో 5వ సీజన్ త్వరలోనే ప్రారంభించే పనిలో ప్రదీప్ ఉన్నాడు. అయితే స్వతహాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన ప్రదీప్ ఈ షోకు పవన్ కళ్యాణ్ ని తీసుకురావాలని మొదటి నుండి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ విషయంలో తాజాగా ఒక వార్తా ఇండస్ట్రీలో చక్కెర్లు కొడుతుంది.

    Also Read: నైజాంలో 42 కోట్లు పలికిన ఆచార్య !

    సీజన్ 5 లో తోలి ఎపిసోడ్ లో పవర్ స్టార్ ని ఇంటర్వ్యూ చేసి ఈ సీజన్ ని ఘనంగా ఆరంభించాలని ప్రదీప్ ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ మేరకు రీసెంట్ గా పవర్ స్టార్ ని కలవగా ఆయన ప్రదీప్ కోరికకు అంగీకరించారని తెలుస్తుంది. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాను పూర్తి చేసి మరో రెండు సినిమాలను ఒకేసారి చేస్తూ, మరోవైపు రాజకీయ కార్యక్రమాలను చూసుకుంటూ పవన్ బాగా బిజీగా ఉన్నారు. అంతటి బిజీ షెడ్యూల్స్ తో ఉన్న పవన్ ప్రదీప్ షోకి నిజంగా వస్తారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఇదివరకొకసారి ఇలానే పవర్ స్టార్ వస్తున్నారని బాగానే హడావిడి చేయగా ఆ తర్వాత అది అవాస్తమని తేలింది. ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం…

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్