నాలుగో రోజు తగ్గిన బంగారం ధరలు.. ఎంత తగ్గాయంటే..?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన రోజు నుంచి బంగారం, వెండి ధరలు అంతకంతకూ తగ్గుతున్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా దేశీయ మార్కెట్ లో బంగారం ధరలు తగ్గడం గమనార్హం. నేడు బంగారం ధర 322 రూపాయలు తగ్గగా వెండి ధర ఏకంగా 972 రూపాయలు తగ్గింది. బంగారం, వెండి ధరలు తగ్గడంతో కొనుగోళ్లకు ఇదే సరైన సమయమని చెప్పవచ్చు. పెళ్లిళ్లకు, శుభకార్యాలకు బంగారం కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడు కొనుగోలు చేస్తే […]

Written By: Kusuma Aggunna, Updated On : February 4, 2021 5:37 pm
Follow us on

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన రోజు నుంచి బంగారం, వెండి ధరలు అంతకంతకూ తగ్గుతున్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా దేశీయ మార్కెట్ లో బంగారం ధరలు తగ్గడం గమనార్హం. నేడు బంగారం ధర 322 రూపాయలు తగ్గగా వెండి ధర ఏకంగా 972 రూపాయలు తగ్గింది. బంగారం, వెండి ధరలు తగ్గడంతో కొనుగోళ్లకు ఇదే సరైన సమయమని చెప్పవచ్చు. పెళ్లిళ్లకు, శుభకార్యాలకు బంగారం కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడు కొనుగోలు చేస్తే మంచిది.

Also Read: భారీగా పడిపోయిన చికెన్ ధరలు.. కిలో ఎంతంటే..?

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర 47,135 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 67,170 రూపాయలకు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం కూడా వెండి ధరలు తగ్గడానికి కారణమని తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు తగ్గుతున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్ లో కూడా ఇదే పరిస్థితి ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు.

Also Read: ఎల్ఐసీ సూపర్ స్కీమ్.. నెలకు రూ.14 వేలు పెన్షన్ పొందే ఛాన్స్..?

డాలరుతో పోల్చి చూస్తే రూపాయి విలువ బలపడటం కూడా బంగారం, వెండి ధరలు తగ్గడానికి కారణమని సమాచారం. అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్సు బంగారం ధర 1,825 డాలర్లు ఉండగా ఔన్సు వెండి ధర 26.61 డాలర్లుగా ఉంది. బంగారం, వెండి ధరలపై వేర్వేరు అంశాలు ప్రభావం చూపుతాయి. భౌగోళిక ఉద్రిక్తతలు, జువెలరీ మార్కెట్, బ్యాంకుల దగ్గర ఉన్న బంగారం నిల్వలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి.

మరిన్ని వార్తలు కోసం: వ్యాపారము

గతేడాది కరోనా వైరస్ విజృంభణ వల్ల వల్ల బంగారం, వెండి కొనుగోళ్లు తగ్గిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది మాత్రం బంగారం, వెండి కొనుగోళ్లు క్రమంగా పుంజుకుంటున్నాయి.