https://oktelugu.com/

ఆధార్‌ కార్డులో పెళ్లి భోజనాల లిస్ట్.. అసలేం జరిగిందంటే..?

మన దేశంలో నివేశించే వాళ్లకు ఆధార్ కార్డ్ ఎంత ముఖ్యమైన కార్డు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పథకాలకు అర్హత పొందాలన్నా, సిమ్ కార్డును తీసుకోవాలన్నా ఆధార్ కార్డ్ కచ్చితంగా ఉండాల్సిందే. అయితే ఒక జంట తమ పెళ్లి భోజనాల మెనూను ఆధార్ కార్డులా ముద్రించుకుంది. మోదీ డిజిటల్‌ ఇండియాకు మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ జంట భిన్నంగా ఆలోచించి ఆధార్ కార్డును పోలి ఉన్న పెళ్లి భోజనాల మెనూలను ముద్రించి బంధువులకు పంచింది. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 4, 2021 5:59 pm
    Follow us on

    Wedding Invitation Aadhar Card

    మన దేశంలో నివేశించే వాళ్లకు ఆధార్ కార్డ్ ఎంత ముఖ్యమైన కార్డు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పథకాలకు అర్హత పొందాలన్నా, సిమ్ కార్డును తీసుకోవాలన్నా ఆధార్ కార్డ్ కచ్చితంగా ఉండాల్సిందే. అయితే ఒక జంట తమ పెళ్లి భోజనాల మెనూను ఆధార్ కార్డులా ముద్రించుకుంది. మోదీ డిజిటల్‌ ఇండియాకు మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ జంట భిన్నంగా ఆలోచించి ఆధార్ కార్డును పోలి ఉన్న పెళ్లి భోజనాల మెనూలను ముద్రించి బంధువులకు పంచింది.

    Also Read: కంపెనీ వింత ఆఫర్.. వాలంటైన్స్ డే నాడు ఫ్రీగా విడాకులు..?

    పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన నూతన వధువరులు ఆధార్ కార్డును పోలిన పెళ్లి భోజనాల మెనూ ఇవ్వడంతో బంధువులు, స్నేహితులు అవాక్కయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వింత పెళ్లి భోజనాల మెనూ తెగ వైరల్ అవుతోంది. ఆధార్ కార్డును పోలి ఉన్న ఈ పెళ్లి భోజనాల జాబితాపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన పెళ్లికొడుకు గోగోల్‌ షాహా, పెళ్లికొడుకు సుబర్ణ దాస్‌ ల పెళ్లి ఈ నెల 1వ తేదిన ఘనంగా జరిగింది.

    Also Read: శుభకార్యాలలో కంకణం ఎందుకు కట్టుకుంటారో తెలుసా..?

    వివాహ భోజనాల జాబితా గురించి పెళ్లి కొడుకు గోగోల్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భార్య సుబర్ణ దాస్‌ ఆలోచన ఆలోచన మేరకు డిజిటల్ ఇండియాకు మద్ధతుగా ఈ పెళ్లి పత్రికను ముద్రించామని తెలిపారు. డిజిటల్ ఇండియాకు మద్దతు ఇవ్వడానికి ఇంతకంటే ఉత్తమ మార్గం తమకు కనిపించలేదని గోగోల్ పేర్కొన్నారు. ఆధార్ కార్డ్ మెనూను చూసి బంధువులు అవాక్కయ్యారని గొగోల్ తెలిపారు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    ఆధార్ కార్డును చూసిన కొందరు బంధువులు పెళ్లిలో భోజనం చేయాలంటే కూడా ఆధార్ కార్డ్ అవసరం అవుతోందని.. డైనింగ్‌ టెబుల్ దగ్గర ఆధార్ కార్డు మరిచిపోయామని సరదాగా చమత్కరించామని గొగోల్ అన్నారు.