game changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో మొదలై చాలా రోజులైంది. లండన్ వంటి ప్రాంతాల్లో అద్భుతమైన ట్రెండింగ్ కనబరుస్తుంది కానీ, మన టాలీవుడ్ కి అత్యంత భారీ వసూళ్లను అందించే నార్త్ అమెరికా లో మాత్రం యావరేజ్ రేంజ్ ట్రెండ్ ని చూపిస్తుంది. అంతటి భారీ చిత్రానికి ‘దేవర’, ‘కల్కి’ ,’పుష్ప 2 ‘ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఉంటాయని ఆశించారు అభిమానులు. కానీ ఆ రేంజ్ ట్రెండ్ లేకపోవడం తో కాస్త నిరాశకి గురి అవుతున్నారు. సినిమాకి క్రేజ్ లేక అలాంటి ట్రెండ్ ఉంది అనుకుంటే పెద్ద పొరపాటే, అసలు కారణం మరొకటి ఉంది.
అదేమిటంటే నార్త్ అమెరికా లో ఒక సినిమాకి భారీ వసూళ్లు రావాలంటే కచ్చితంగా XD , ఐమాక్స్ షోస్ భారీ గా ఉండాలి. కానీ ‘గేమ్ చేంజర్’ చిత్రానికి అత్యధికంగా స్టాండర్డ్ షోస్ ని మాత్రమే ఇప్పటి వరకు షెడ్యూల్ చేసారు. ఈ స్టాండర్డ్ షోస్ నుండి అడ్వాన్స్ బుకింగ్స్ భారీ గా ఉండవు. అత్యధిక షోస్ వెయ్యడం వల్ల గ్రాస్ కనిపిస్తుంది కానీ, యావరేజ్ బుకింగ్స్ రేట్ తక్కువే. అది ‘గేమ్ చేంజర్’ చిత్రానికి మాత్రమే కాదు, ఏ సినిమాకి అయినా ఇదే ట్రెండ్ ఉంటుంది. సినిమా విడుదలకు 18 రోజులకు ముందు ‘దేవర’ చిత్రానికి 250 కి పైగా XD షోస్ షెడ్యూల్ అయ్యాయి. అదే విధంగా కల్కి కి కూడా షెడ్యూల్ చెయ్యబడ్డాయి. ముఖ్యంగా ‘పుష్ప 2 ‘ కి అయితే ఏకంగా వెయ్యి XD షోస్ షెడ్యూల్ అయ్యాయి.
కానీ ‘గేమ్ చేంజర్’ చిత్రానికి ఇప్పటి వరకు కేవలం నార్త్ అమెరికా మొత్తం మీద 38 మాత్రమే షెడ్యూల్ అయ్యాయి. ఇంత తక్కువ షోస్ షెడ్యూల్ అవ్వడానికి ప్రధాన కారణం రీసెంట్ గా విడుదలైన హాలీవుడ్ చిత్రం ముఫాసా. ఈ సినిమా హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది. అక్కడి థియేటర్స్ యాజమాన్యాలు మొత్తం ఈ సినిమాకి షోస్ ని షెడ్యూల్ చేసే బిజీ లో ఉన్నారు. ముఖ్యంగా క్రిస్మస్ వాళ్లకు అతి పెద్ద హాలిడే అనే విషయం మన అందరికీ తెలిసిందే. వసూళ్లు భారీ వచ్చే దినం కావడంతో సినీ మార్క్ థియేటర్స్ వాళ్ళు ‘గేమ్ చేంజర్’ XD షోస్ కి ఇంకా టైమింగ్స్ ఇవ్వలేదు. ఒక్కసారి XD షోస్ మొత్తాన్ని షెడ్యూల్ చేస్తే ‘గేమ్ చేంజర్’ అవలీల గా 1 మిలియన్ మార్కు కి చేరుకుంటుంది. ప్రస్తుతానికి అయితే ‘గేమ్ చేంజర్’ చిత్రం నార్త అమెరికా లో ప్రీమియర్స్ నుండి 2 లక్షల 50 వేల గ్రాస్ మార్కుని అందుకుంది.