https://oktelugu.com/

Marco : చరిత్ర సృష్టిస్తున్న ‘జనతా గ్యారేజ్’ విలన్..’పుష్ప 2′ ని కూడా డామినేట్ చేస్తున్న ‘మార్కో’ వసూళ్లు!

కంటెంట్ బాగుంటే పాన్ ఇండియన్ లెవెల్ లో హీరో తో సంబంధం లేకుండా వసూళ్లు వస్తున్నాయి ఈమధ్య కాలంలో.

Written By:
  • Vicky
  • , Updated On : December 24, 2024 / 08:21 AM IST

    Marco

    Follow us on

    Marco : కంటెంట్ బాగుంటే పాన్ ఇండియన్ లెవెల్ లో హీరో తో సంబంధం లేకుండా వసూళ్లు వస్తున్నాయి ఈమధ్య కాలంలో. ఒకప్పుడు స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలకు, మిగిలిన హీరోల సినిమాలకు వసూళ్ల విషయం లో చాలా తేడా ఉండేది. కానీ ఇప్పుడు ఆ తేడా చెరిగిపోయింది. టాక్ బాగుంటే హీరో పేరు తెలియకపోయిన కూడా జనాలు ఇరగబడి చూసే రోజులు వచ్చాయి. ఈ విషయం మనకి సంక్రాంతి కానుకగా విడుదలైన ‘హనుమాన్’ చిత్రం తోనే అర్థమైంది. ఒక విధంగా చెప్పాలంటే ఇండియన్ సినిమాకి ప్రస్తుతం మహర్దశ పట్టుకుంది. ముఖ్యంగా క్వాలిటీ సినిమాలను అందించడం లో ఈ ఏడాది మన టాలీవుడ్ ఇండస్ట్రీ మీద మలయాళం ఫిలిం ఇండస్ట్రీ ఒక అడుగు ముందు ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. ఎన్నో అద్భుతమైన చిత్రాలను ఈ ఏడాది ప్రేక్షకులకు అందించింది. ఇప్పుడు లేటెస్ట్ గా ‘మార్కో’ అనే చిత్రం మలయాళం బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది.

    ఉన్ని ముకుందన్ హీరో గా నటించిన ఈ యాక్షన్ చిత్రం నాలుగు రోజుల్లోనే 45 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఉన్ని ముకుందన్ అంటే మరెవరో కాదు, జూనియర్ ఎన్టీఆర్ హీరో గా నటించిన ‘జనతా గ్యారేజ్’ లో మోహన్ లాల్ కొడుకు గా, విలన్ క్యారక్టర్ లో కనిపిస్తాడు గుర్తుందా?, అతనే ఈయన. మలయాళం ఈయనకి యంగ్ హీరోస్ లో మంచి క్రేజ్ ఉంది. తెలుగు లో ఈయన ‘జనతా గ్యారేజ్’ చిత్రం తర్వాత ‘భాగమతి’, ‘యశోద’ , ‘ఖిలాడీ’ వంటి చిత్రాల్లో నటించాడు. ఈయన కెరీర్ లో సూపర్ హిట్స్ చాలానే ఉన్నాయి కానీ, అతన్ని స్టార్ హీరో రేంజ్ కి తీసుకెళ్లే సినిమాలు మాత్రం పడలేదు. ఆయన అభిమానులు ఎప్పటి నుండో అలాంటి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి సినిమా మార్కో రూపం లో ఉన్నిముకుందన్ కి దొరికింది అని చెప్పొచ్చు.

    మలయాళం ఇండస్ట్రీ ఇతర ఇండుస్త్రీలతో పోలిస్తే చాలా చిన్నది. ఇక్కడ వంద కోట్ల రూపాయిల గ్రాస్ సినిమా వచ్చిందంటే వేరే లెవెల్ అన్నట్టు. అలాంటిది ‘మార్కో’ చిత్రం ఊపు చూస్తుంటే మొదటి వారంలోనే 70 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టేలా ఉంది. కేరళలో మొదటి రోజు ఈ చిత్రానికి నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. నాల్గవ రోజు (సోమవారం) కూడా 4 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చింది. దీనిని బట్టి ఈ చిత్రం ఏ రేంజ్ సెన్సేషన్ అనేది అర్థం చేసుకోవచ్చు. కచ్చితంగా ఉన్ని ముకుందన్ ఈ చిత్రం తర్వాత స్టార్ హీరోల లీగ్ లోకి చేరిపోయినట్టే. నిన్న ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో గంటకు 12 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయే రేంజ్ లో ట్రెండ్ ఉన్నింది. ఒకానొక దశలో ఈ చిత్రం ‘పుష్ప 2’ ని కూడా బుక్ మై షో లో డామినేట్ చేసింది.