Sandhya Theatre Incident: గత రెండు వారాలుగా సంధ్య థియేటర్ లో జరిగిన దుర్ఘటన నేషనల్ మీడియా లో ఎంతటి సెన్సేషనల్ టాపిక్ గా మారిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ లో ఈ వ్యవహారం పై ఘాటు గా స్పందించడం సంచలనంగా మారింది. పోలీసులు కూడా అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యం గా వ్యవహరించడం వల్లే, రేవతి చనిపోవడానికి కారణం అని అర్థం వచ్చేలా సరైన ఆధారాలతో కూడిన ఒక వీడియో ని విడుదల చేసారు. పదిలో నిమిషాల నిడివి ఉన్నటువంటి ఈ వీడియో ని చూసి నిజంగా అల్లు అర్జున్ పెద్ద పొరపాటు చేసాడు అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి ఆయన నిజంగా తప్పు చేశాడా లేదా అనేది హై కోర్టు లో తేలే వ్యవహారం కానీ, అల్లు అర్జున్ ఎలాంటి ఎలాంటి తప్పు చేయలేదని చనిపోయిన రేవతి భర్త భాస్కర్ నేషనల్ మీడియా తో మాట్లాడాడు.
ఆయన మాట్లాడుతూ ‘సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసిలాట వల్ల నా భార్య చనిపోయింది. కానీ అందుకు అల్లు అర్జున్ కారణం కాదు. నా బిడ్డ శ్రీ తేజ్ అల్లు అర్జున్ కి వీరాభిమాని. సినిమా విడుదలకు నెల రోజుల ముందు నుండే వాడు నన్ను పుష్ప 2 కి తీసుకెళ్లామని మారం చేసేవాడు. వాడి కోసం నా స్నేహితుడిని అడిగి టికెట్స్ సంపాదించాను. అనుకోకుండా ఈ దురదృష్టకర సంఘటన జరిగిపోయింది. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడానికి మేమే కారణమని ప్రచారం చేస్తున్నారు. అది మాకు అసలు నచ్చడం లేదు. ఘటన జరిగిన మరుసటి రోజు నుండే మేము అల్లు అర్జున్ కి సపోర్టు చేస్తూ వచ్చాము. మేము ఆయనపై వేసిన కేసు ని కూడా వెనక్కి తీసుకోవాలని అనుకున్నాం’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
స్వయంగా మృతురాలి భర్తనే కేసు వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే, పోలీసులు ఎందుకు ఈ విషయాన్నీ ఇంకా లాగుతున్నారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. మరోపక్క అల్లు అర్జున్ ని ఈ కేసు విషయం లో విచారించడానికి మరోసారి పోలీస్ స్టేషన్ కి హాజరు కావాల్సిందిగా నిన్న హైదరాబాద్ పోలీసులు ఉత్తర్వులు జారీ చేసారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఆయన పోలీస్ స్టేషన్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క ఆయనకి ఇచ్చిన ఇంటెర్మ్ బెయిల్ గడువు జనవరి 12 తో ముగియనుంది. అయితే కేసు ముద్దాయి గా ఉన్నటువంటి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయం పై మాట్లాడడం చట్ట విరుద్ధం అని, ఈ కారణం చేత ఆయనకి ఇచ్చిన బెయిల్ ని రద్దు చెయ్యాలంటూ నేడు పోలీసులు కోర్టు లో పిటీషన్ వేసే అవకాశాలు ఉన్నాయి.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు అల్లు అర్జున్ కారణం కాదు
మా అబ్బాయి అల్లు అర్జున్ కు పెద్ద అభిమాని.. పుష్ప 2 సినిమాకు వెళ్దామని నెల రోజుల ముందు అడిగేవాడు
నా స్నేహితులను అడిగి టిక్కెట్లు తీసుకున్నా.. మా వల్లే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడన్న విషయం నచ్చలేదు
రెండో రోజు నుంచే అల్లు… pic.twitter.com/qkXLbavkJZ
— Telugu Scribe (@TeluguScribe) December 23, 2024