https://oktelugu.com/

NTR and Prashant Neel : ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చే సినిమాతో ఇండియా షేక్ అవుతుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 4, 2024 / 10:55 AM IST

    NTR

    Follow us on

    NTR and Prashant Neel :  తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక ఇప్పటికే నందమూరి ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా పాన్ ఇండియాలో మంచి మార్కెట్ ని కూడా క్రియేట్ చేసుకున్నాడు… ఇక ప్రస్తుతం ఆయన వరుస సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరో ఒక భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. అయితే దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఆయన అనుకున్న రేంజ్ లో సక్సెస్ మాత్రం సాధించలేకపోయాడు. ఇక పాన్ ఇండియాలో రిలీజ్ అయిన ఈ సినిమా 300 కోట్ల పైన కలెక్షన్లను రాబట్టి ఎన్టీఆర్ స్టామినాని భారీగా దెబ్బతీసిందనే చెప్పాలి. మరి ఆయన లాంటి హీరో ఇండస్ట్రీలో మరొకరు ఉండరనేది వాస్తవం… ఎందుకంటే డైలాగ్ డెలివరీలో గాని, ఆయన యాక్టింగ్ లో గాని కొత్తదనం చూపిస్తూ ఎప్పటికప్పుడు ముందుకు దూసుకెళ్తూ ఉంటాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కడమే కాకుండా భారీ వసూళ్లను కూడా రాబడుతుందనే ఒక కాన్ఫిడెంట్ ను అయితే వ్యక్తం చేస్తున్నాడు.

    ఇక ఏది ఏమైనా కూడా ప్రశాంత్ నీల్ కి పాన్ ఇండియాలో మంచి మార్కెట్ అయితే ఉంది. మరి ఆయన మార్కెట్ తో పాటు ఎన్టీఆర్ కి కూడా అంతో ఇంతో మార్కెట్ అయితే ఉంది. మరి వీళ్లిద్దరూ కలిసి ఇండియన్ మార్కెట్ ని షేక్ చేయబోతున్నారా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

    ఇక ఈ సినిమా సెట్స్ మీద కు ఎప్పుడు వెళ్తుంది అనే విషయం మీద ఇంకా సరైన క్లారిటీ అయితే రాలేదు. కానీ ఈ సినిమా మాత్రం పెను రికార్డులను క్రియేట్ చేస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న చాలా సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగడమే కాకుండా ఆయనకంటూ ఒక ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక ప్రశాంత్ నీల్ అంటేనే డార్క్ మోడ్ లో సినిమాలు ఉంటాయి. ఇంతకుముందు ఆయన చేసిన కేజిఎఫ్ సలార్ సినిమాలు అదే మూడ్ లో ఉండడం మనం గమనించాం.

    కాబట్టి ఈ సినిమా కూడా అదే బాటలో నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా ప్రశాంత్ నీల్ లాంటి దర్శకుడి తో ఎన్టీఆర్ సినిమా చేయడం అనేది చాలా మంచి విషయం…ఇక వీళ్ళ కాంబోలో వచ్చే సినిమా ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుంది అనేది తెలియాల్సి ఉంది…