Bigg Boss Priyanka: సీరియల్ నటి ప్రియాంక జైన్ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమే. మౌనరాగం, రాముడు కలగనలేదు… వంటి సీరియల్స్ లో లీడ్ రోల్స్ చేసింది. అనంతరం ఆమె బిగ్ బాస్ షోకి వెళ్లారు. 2023లో ప్రసారమైన సీజన్ 7లో ప్రియాంక పాల్గొంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఆమె సత్తా చాటింది. ఫైనల్ కి వెళ్ళింది. ప్రియాంక ఐదవ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఆమె సీరియల్స్ చేయడం లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
కాగా బుల్లితెర నటుడు శివ కుమార్ ఆమె ప్రియుడు. ప్రియాంక-శివ కుమార్ మౌనరాగం సీరియల్ లో కలిసి నటించారు. ఆ సమయంలో ప్రేమలో పడ్డారు. బిగ్ బాస్ షోలో ప్రియాంక ఈ విషయం వెల్లడించింది. శివ కుమార్ తాను డేటింగ్ చేస్తున్నామని చెప్పింది. ప్రియాంక కోసం శివ కుమార్ బిగ్ బాస్ హౌస్ కి వచ్చాడు. మనం హౌస్లోనే వివాహం చేసుకుందామని ప్రియాంక జైన్ అన్నారు. నువ్వు బయటకు వచ్చిన వెంటనే గ్రాండ్ గా వివాహం చేసుకుందామని హామీ ఇచ్చాడు శివ కుమార్.
వీరిద్దరూ కలిసి జీవిస్తున్నారు. ఒకే ఇంట్లో ఉంటున్నారు. చెరో యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈ ఛానల్ లో తరచుగా వీడియోలు చేస్తూ ఉంటారు. కాగా ఇటీవల ప్రియాంక జైన్, శివ కుమార్ చేసిన ఓ వీడియో తీవ్ర విమర్శలకు గురైంది. తిరుమల వెళ్లిన వీరు… అలిపిరి మెట్ల దారిలో తమపై చిరుత దాడి చేసిందని ఒక వీడియో చేశారు. దాన్ని తమ ఛానల్ లో పోస్ట్ చేశారు. అనంతరం అది జస్ట్ ఫ్రాంక్ వీడియో అని క్లారిటీ ఇచ్చారు.
దీనిపై టీడీపీ పాలకమండలి సీరియస్ అయ్యింది. అలిపిరి నడక దారిలో చిరుతలు దాడి చేస్తున్నాయని భక్తులను ప్రియాంక, శివ కుమార్ తప్పుదోవ పట్టించారు. భయాందోళనకు గురి చేశారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ప్రియాంక జైన్, శివ కుమార్ ఒక వీడియో విడుదల చేశారు. తాము కావాలని చేయలేదు. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీయాలని అనుకోలేదు. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసే ఆలోచన మాకు లేదు.
తెలియక చేసిన తప్పు.. మమ్మల్ని క్షమించండి.. అని ఆ వీడియోలో వేడుకున్నారు. కాగా ఈ వీడియో వైరల్ అవుతుంది. గతంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో కొందరు యువకులు ఫ్రాంక్ వీడియోలు చేసి శిక్షకు గురయ్యారు. టీటీడీ వీరిని వదిలేస్తుందా. కేసులు పెట్టి సీరియస్ యాక్షన్ తీసుకుంటుందా? అనేది చూడాలి..