CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు గురించి ఆసక్తికర చర్చ ఒకటి నడుస్తోంది.ఇటీవల అమరావతిలో చంద్రబాబు ఇంటి స్థలం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.ఇప్పటివరకు రాజధాని ప్రాంతంలో చంద్రబాబుకు సొంత ఇల్లు లేదు. కరకట్టలపై నివాసం పై వైసిపి ఏ స్థాయిలో వివాదం చేసిందో తెలియంది కాదు.అందుకే రాజధానిలో అందరికీ ఆమోదమైన ప్రాంతంలో ఇంటిని నిర్మించాలని చంద్రబాబు ప్లాన్. రాజధాని లోని వివిధ ప్రాంతాల్లో స్థలం కోసం అన్వేషించిన చంద్రబాబు చివరికి వెలగపూడి రెవెన్యూ పరిధిలో ఓ స్థలాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఓ ఐదు ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ స్థలం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైతుల పేరిట ఉన్న రిటర్నబుల్ ఫ్లాట్ గా చెబుతున్నారు. ఇప్పటికే ఆ రైతులకు డబ్బు కూడా చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ ప్లాట్ 25 వేల చదరపు గజాలు కాగా.. ఈ 6 రోడ్డుకు ఆనుకొని ఉంటుంది. అలాగే ఈ స్థలానికి నాలుగు వైపులా రోడ్డు కూడా ఉంటుందని తెలుస్తోంది. అమరావతిలో కీలకమైన సీడ్ యాక్సెస్ మార్గం దీని పక్క నుంచి వెళ్తుందట. అన్ని విధాలా ఆమోదయోగ్యంగా ఉండడంతో చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
* సొంత ఇంటి నిర్మాణం
ఇప్పటికే జగన్ తాడేపల్లిలో ప్యాలెస్ నిర్మించుకున్నారు. కానీ చంద్రబాబు ఇంతవరకు పూర్తిస్థాయిలో నిర్మాణం చేపట్టలేదు. అందుకే ఈసారి వీలైనంత త్వరగా ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే ఇప్పుడు కొనుగోలు చేసిన స్థలం తాత్కాలిక హైకోర్టు, విట్, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్, గెజిటెడ్ అధికారులు, ఎన్జీవోల నివాస సముదాయాలు, న్యాయమూర్తుల బంగ్లాల వంటి భవనాలు ఈ ప్లాట్ కు రెండు కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి. దాదాపు 5 ఎకరాల్లో ఉన్న ప్లాట్లో కొంత విస్తీర్ణంలోనే ఇల్లు నిర్మించి.. మిగిలిన స్థలాన్ని ఉద్యానవనం, సెక్యూరిటీ సిబ్బందికి గదులు, వాహనాల పార్కింగ్ వంటి అవసరాల కోసం వినియోగించనున్నట్లు సమాచారం.
* మట్టి పరీక్షలు పూర్తి
చంద్రబాబు కొనుగోలు చేసిన ఈ స్థలంలో మట్టి పరీక్షలు సైతం పూర్తి చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ప్రస్తుతం కృష్ణానది ఒడ్డున ఉండవల్లి కరకట్ట మార్గంలో లింగమనేని కి చెందిన గెస్ట్ హౌస్ లో ఉంటున్నారు. గత పదేళ్లుగా ఆయన ఆ ఇంట్లోనే బస చేస్తున్నారు. తాజాగా స్థలం కొనుగోలుతో సొంత ఇల్లు సాకారం కానుంది. చంద్రబాబు కేరాఫ్ ఉండవల్లి అని ఇప్పటివరకు చెబుతుండేవారు. ఇకనుంచి చంద్రబాబు కేరాఫ్ వెలగపూడి గా మారబోనుందన్న మాట. అయితే ఇప్పటికే చంద్రబాబు సొంత నియోజకవర్గ కుప్పంలో సైతం ఓ ఇంటిని నిర్మిస్తున్నారు. అక్కడ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా అమరావతిలో కొనుగోలు చేయడంతో.. ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.