spot_img
Homeఎంటర్టైన్మెంట్Hero Nikhil Wife : సింపతీ మాటలు చెప్పి మాయ చేశాడు, పెళ్లయ్యాక అవసరం తీరిపోయింది......

Hero Nikhil Wife : సింపతీ మాటలు చెప్పి మాయ చేశాడు, పెళ్లయ్యాక అవసరం తీరిపోయింది… నిఖిల్ పై భార్య ఆరోపణలు!

Hero Nikhil Wife  : హీరో నిఖిల్ భార్య పల్లవి ఆయనపై ఆరోపణలు చేశారు. పల్లవి లేటెస్ట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కమెడియన్ వెన్నెల కిషోర్ ‘అలా మొదలైంది’ పేరుతో టాక్ షో చేస్తున్నారు. మొదటిసారి ఆయన హోస్టింగ్ అవతారం ఎత్తారు. మార్చి 28 నుండి ఈ షో ఈటీవీ ఛానల్ లో ప్రసారం కానుంది. మొదటి ఎపిసోడ్ గెస్ట్స్ గా హీరో నిఖిల్ భార్య పల్లవితో పాటు వచ్చారు. ఈ యంగ్ కపుల్ నుండి ఆసక్తికర విషయాలు రాబట్టే ప్రయత్నం చేశారు వెన్నెల కిషోర్. మొదటి ప్రశ్నతోనే నిఖిల్ ని ఇరికించాడు. పల్లవి పేరెంట్స్ పేర్లేంటో చెప్పాలని అడిగాడు. నిఖిల్ అత్తమామల పేర్లు చెప్పలేక తడబడ్డారు.

దానికి వెన్నెల కిషోర్ నవ్వుకున్నాడు. పెళ్ళైపోయింది కదా, వాళ్లతో పనేముంది. మర్చిపోయాడు అని పల్లవి కౌంటర్ వేసింది. అనంతరం తమ లవ్ స్టోరీ చెప్పాలని వెన్నెల కిషోర్ అడిగారు. ‘పేరెంట్స్ కి చెప్పిన లవ్ స్టోరీ చెప్పాలా? నిజంగా జరిగిన స్టోరీ చెప్పాలా?’ అని నిఖిల్ అన్నారు. ‘నిజంగా జరిగిందే చెప్పండి’ అని వెన్నెల కిషోర్ అన్నారు. ‘మా పేరెంట్స్ ఈ షో చూస్తారేమో’ అని అఖిల్ అన్నారు. చూడరులే అని వెన్నెల కిషోర్ నిఖిల్ తో అన్నారు.

ఆ లవ్ స్టోరీ ఏంటో పల్లవి బయటపెట్టింది. ‘నాకు శాడ్ స్టోరీస్ చెప్పి పడేశాడు. అమ్మో ఇతనికి ఇన్ని బాధలు ఉన్నాయా? అని నేను ఫీలయ్యాను’ అని పల్లవి చెప్పారు. తన ప్రేమ పొందేందుకు సింపతీ కార్డు వాడాడని ఆమె మాటలను బట్టి అర్థం అవుతుంది. అలా మొదలైంది ఎపిసోడ్ ప్రోమోలో ఉన్న ఈ ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి. హోస్ట్ గా వెన్నెల కిషోర్ అలరిస్తారనిపిస్తుంది. అలా మొదలైంది షోలో యంగ్ కపుల్స్ పాల్గొననున్నారని సమాచారం.

ఫస్ట్ కపుల్ గా నిఖిల్-పల్లవి వచ్చారు. కాగా గత ఏడాది పల్లవి-నిఖిల్ విడిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. మనస్పర్థలతో ఈ జంట విడాకులు తీసుకుంటున్నారంటూ ప్రచారం జరిగింది. ఈ పుకార్లను రొమాంటిక్ ఫోటోలు షేర్ చేసి ఖండించారు నిఖిల్. డాక్టర్ అయిన పల్లవిని 2020లో నిఖిల్ వివాహం చేసుకున్నారు. లాక్ డౌన్ ఆంక్షల మధ్య అత్యంత సన్నిహితుల సమక్షంలో నిఖిల్ వివాహం జరిగింది. నిఖిల్ హీరోగా గత ఏడాది విడుదలైన కార్తికేయ 2 భారీ విజయం సాధించింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Vaibhav Suryavanshi 94 Runs

Vaibhav Suryavanshi : రికార్డు లెవెల్ లో 50 కొట్టినా.. బుడ్డోడిని ఏడిపించారు.. ఇదేం న్యాయం..

Vaibhav Suryavanshi : వరుసగా ఆరు ఓటముల తర్వాత టీమ్ ఇండియా మళ్లీ విక్టరీ ట్రాక్ ఎక్కింది.. జింబాబ్వే జట్టుతో జరుగుతున్న మూడు టి20 మ్యాచ్ సిరీస్ లో.. తొలి మ్యాచ్లో విజయం...
Men's Mental Health

men’s health : మగవాళ్లు చెప్పుకోలేని ఐదు సమస్యలున్నాయి.. అవేంటో తెలుసా..

men's health : ‘నువ్వు మగాడివి బాస్.. ధైర్యంగా ఉండాలి.. కుటుంబానికి అండగా ఉండాలి..’అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఒక కుటుంబంలో ఎవరికి సమస్య వచ్చినా వాటి పరిష్కారానికి తీవ్ర కృషి...

body fat : కొవ్వుతో మెదడుపై ప్రభావం.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు..

body fat : ప్రస్తుత కాలంలో చాలామంది రకరకాల ఆహారాన్ని తింటూ ఉన్నారు. ముఖ్యంగా ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్ తో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు...
Oktelugu Epaper