Crazy Hero: సినిమా ఇండస్ట్రీలో వాళ్లు చేసింది అతి తక్కువ సినిమాలు అయినా కూడా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ఎప్పటికీ చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్నారు. హీరో లేదా హీరోయిన్స్ గా స్టార్డం తెచ్చుకోకముందు చాలామంది హీరోలు పలు సినిమాలలో కామియో రోల్స్ లో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరో టాలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నటీనటులు ఒకప్పటికి మరియు ఇప్పటికీ చాలా మారిపోయారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరో లేదా హీరోయిన్లు ఒకప్పుడు ఎలా ఉన్నారో చూస్తే అమ్మ బాబోయ్ అనుకోకుండా ఉండలేము. సెలబ్రిటీలకు సంబంధించిన అరుదైన ఫోటోలు నిత్యం సామాజిక మాధ్యమాలలో కనిపిస్తూనే ఉంటాయి. అప్పట్లో చాలామంది హీరోలు మరియు హీరోయిన్లు సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసి మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ఇలా సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత హీరో లేదా హీరోయిన్స్ గా స్టార్డం సంపాదించుకున్నారు. ఫోటోలో కనిపిస్తున్న హీరో టాలీవుడ్ లో స్టార్ హీరోగా వరుసగా సినిమాలు చేసి డాక్టర్స్ దగ్గర సూపర్ హిట్ అందుకున్నాడు. తన కెరియర్ స్టార్టింగ్ లో సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫోటో సొంతం సినిమా లోది. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన సొంతం సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.
Also Read: నా ప్రేమ నిజమైతే..నువ్వు మళ్ళీ నా జీవితంలోకి రావాలి అంటూ యాంకర్ రష్మీ ఎమోషనల్ కామెంట్స్!
ఆర్యన్ రాజేష్ హీరోగా నటించిన సినిమాలో నమిత హీరోయిన్గా నటించింది. ఇప్పటికి కూడా ఈ సినిమా చాలామందికి ఫేవరెట్ సినిమా. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో ప్రసారమైతే అభిమానులు ఎంతో ఇష్టంగా చూస్తారు. ఈ సినిమాలో ముఖ్యంగా సునీల్ కామెడీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా క్లైమాక్స్ లో అమెరికా పెళ్లి కొడుకుగా కనిపించిన హీరో ఎవరో గుర్తుపట్టగలరా. అతను టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్. ఇతని గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో అడవి శేష్ నటించిన చాలా సినిమాలు మంచి విజయం సాధించాయి.
View this post on Instagram
ఇతను హీరోగా మారడానికి ముందు టాలీవుడ్ లో చాలా సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో కనిపించాడు. కర్మ అనే సినిమాతో ఇతనికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పంజా సినిమాలో ఒక క్యామియో రోల్లో కనిపించాడు. ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇతను తెలుగులో గూఢచారి, హిట్ 2, ఎవరు, మేజర్ వంటి పలు సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం అడవి గూఢచారి 2 మరియు డేకాయిట్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.