Telugu Anchors Silent: సినిమా ఇండస్ట్రీలో హీరోలు హీరోయిన్లు ఎంతటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకుంటారో దానికి ఏమాత్రం తీసిపోకుండా యాంకర్స్ కూడా మంచి ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకుంటారు. బుల్లితెర మీద వాళ్ళు ప్రేక్షకులను అలరిస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళ పంథాను మార్చుకుంటూ యాంకరింగ్ లో కొత్తగా వాళ్ళని వాళ్ళు ప్రజెంట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సుమ లాంటి యాంకర్ అయితే దశాబ్దాలు గడుస్తున్నా కూడా ఆమె మరింత యంగ్ గా కనిపిస్తూ చాలా యాక్టివ్ గా యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు… చాలా మంది కొత్త యాంకర్లు వచ్చినప్పటికి సుమ మాత్రం ఇప్పటివరకు ఎవర్ గ్రీన్ గా నెంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతుందనే చెప్పాలి. అయితే ఒకప్పుడు ఝాన్సీ, ఉదయభాను లాంటి యాంకర్లు ఇండస్ట్రీలో రాణించారు. వాళ్లకు చాలా మంచి గుర్తింపైతే ఉండేది. ఏ షో జరిగిన కూడా వాళ్ళని హోస్ట్ లుగా పిలిచేవారు…ఇక అప్పటినుంచి సుమ ఒక్కరే కంటిన్యూస్ గా యాంకరింగ్ చేస్తూ వస్తున్నారు. ఝాన్సీ మధ్యలో సినిమాల వైపు వెళ్లిపోయి యాంకరింగ్ మానేశారు. ఇక ఉదయభాను అయితే గత దశాబ్ద కాలం నుంచి ఆమె యాంకరింగ్ చేయడం లేదు. ఇక రీసెంట్గా సుహాస్ సినిమా కోసం ఆమె యాంకర్ అవతారం ఎత్తారు…
Also Read: అల్లు అర్జున్ ఫస్ట్ సినిమాను తేజ రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే..?
ఇక ఆ ఈవెంట్ లోనే సుహాస్ ఈ షో కి ఉదయభాను యాంకర్ అని తెలియడం వల్ల నేను ఈవెంట్ కి వచ్చానని చెప్పాడు. దాంతో ఉదయభాను కూడా స్పందిస్తూ నేను కూడా చాలా రోజుల నుంచి యాంకరింగ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పటికి ఇప్పుడున్న సిండికేట్ యాంకర్ల వల్ల నాకు అవకాశాలు రాకుండా పోతున్నాయి అంటూ ఆమె కామెంట్స్ చేశారు.
మరి దీని మీద ఇతర యాంకర్లు ఎలా స్పందిస్తారు అంటూ చాలామంది ఆసక్తిగా ఎదురు చూసినప్పటికి ఇప్పటివరకు ఎవరు కూడా ఉదయభాను మాటలను ఖండిస్తూ కామెంట్స్ అయితే చేయలేదు. రీసెంట్ గా ప్రత్యూష అనే యాంకర్ ను ఉదయభాను గారు చేసిన కామెంట్లకు మీరు ఎలా స్పందిస్తున్నారు అని అడిగితే ఆమె నేను నిజాలు మాత్రమే చెపుతాను కానీ మాట్లాడడానికి ఈ వేదిక సరైనది కాదు అంటూ ఆమె సమాధానమిచ్చారు.
Also Read: మళ్లీ వాయిదానా? ‘రాజా సాబ్’ పరిస్థితేంటి? ఎప్పుడొస్తుంది?
ఇక సుమ, ఝాన్సీ మిగిలిన యాంకర్లు సైతం ఈ విషయం మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. మరి వాళ్ళ మౌనం వెనుక ఉన్న సమాధానం ఏంటి? ఉదయభాను చేసిన కామెంట్లలో నిజం ఉందా? వాళ్ళు కావాలనే ఆమెను తొక్కేశారా? ఎందుకని ఇలా యాంకర్ల మధ్య పొంతన కుదరడం లేదు? ఎవరికి వారు వాళ్ళ షో లతో రాణిస్తే సరిపోతోంది కదా…ఒకరిని తొక్కేసి వీళ్ళు పైకెదగడం వల్ల వాళ్లకు వచ్చే లాభమేంటి? అంటూ మరికొంతమంది సైతం ఉదయభాను మాట్లాడిన మాటలకు సపోర్ట్ చేస్తూ మిగిలిన యాంకర్ల మీద కామెంట్లు చేస్తున్నారు…