AP By-elections Results: ఏపీలో( Andhra Pradesh) ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు ఎన్నికలు ప్రకటించింది ఎలక్షన్ కమిషన్. అయితే సర్పంచులతో పాటు ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ప్రకాశం జిల్లా కొండపి పంచాయతీ, తూర్పుగోదావరి జిల్లా కడియపులంక సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. టిడిపి బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. కడియపులంక సర్పంచిగా ఎం పద్మావతి, కొండపి పంచాయితీ సర్పంచిగా సుశీల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాచర్ల నియోజకవర్గం వేపకం పల్లి ఎంపీటీసీ స్థానంతో పాటు నెల్లూరు జిల్లా కోవూరు లోని విడవలూరు-1 ఎంపీటీసీ, కుప్పం నియోజకవర్గంలోని మణీంద్రం ఎంపీటీసీ స్థానాల్లో కూడా టిడిపి అభ్యర్థులు విజయం సాధించారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Read Also: జీఎస్టీ రికార్డు వృద్ధి : ఆంధ్రా ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవం
రెండు చోట్ల ఏకగ్రీవం..
ప్రకాశం జిల్లా( Prakasam district ) కొండేపి గ్రామ సర్పంచిగా కొమ్ము సుశీల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 14 వార్డులకు గాను 39 మంది నామినేషన్లు దాఖలు చేశారు. సర్పంచ్ పదవికి 15 మంది నామినేషన్లు సమర్పించారు. అయితే చివర్లో అందరూ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో సుశీల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 14 వార్డులకు గాను టిడిపికి 9, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఐదు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మరోవైపు కొండపి పంచాయితీ సర్పంచ్ ఎన్నికలు గత 15 సంవత్సరాలుగా జరగలేదు. న్యాయస్థానంలో పెండింగ్లో ఉండేది. క్లియరెన్స్ కావడంతో ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చింది.మరోవైపు కడియపులంక సర్పంచ్ గా మాదిశెట్టి పద్మావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. చనిపోయిన సర్పంచ్ అమ్మాణీ కుమార్తె పద్మావతి నామినేషన్ దాఖలు చేశారు. మిగతా మహిళల సైతం నామినేషన్లు వేశారు. చివరి నిమిషంలో ఉపసంహరించుకోవడంతో పద్మావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Read Also: ఏపీలో రేపటి నుంచి వారికి ఉచిత విద్యుత్!
ఆ రెండు చోట్ల హోరాహోరి..
మరోవైపు కడప జిల్లాలో( Kadapa district ) రెండు జడ్పిటిసి స్థానాలకు సంబంధించి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండు స్థానాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవే. అయితే మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. అందుకే ఇక్కడ టిడిపి సైతం పోటీ చేస్తోంది. ముఖ్యంగా జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ఈనెల 12న అక్కడ పోలింగ్ జరగనుంది. 14న ఫలితాలు ప్రకటించనున్నారు.