Why Tollywood Skipped AP CM Meet: తెలుగు సినీ ప్రముఖులు సీఎం చంద్రబాబును( CM Chandrababu) ఎందుకు కలవలేదు? 18న సమావేశం అంటూ ఎందుకు ప్రచారం చేశారు? తరువాత ఎందుకు మానేశారు? చంద్రబాబు బిజీ అని చెప్పారా? ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఈ సమావేశం వాయిదా పడిందా? లేకుంటే మరో కారణమా? అసలు ఏం జరిగింది? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదో ఆసక్తికర చర్చ. ఇటీవల పవన్ హెచ్చరికల నేపథ్యంలో సినీ ప్రముఖులు స్పందించారు. సీఎం చంద్రబాబును కలిసేందుకు నిర్ణయించారు. అందుకు అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ముందుగా పవన్ కళ్యాణ్ ను కలిసి.. ఆయనతో పాటు సీఎం చంద్రబాబును కలవాలని నిర్ణయించారు. సినీ పరిశ్రమ విస్తరణ, పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై చర్చిస్తారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు బిజీగా ఉన్నారని.. ప్రధాని మోదీ విశాఖపట్నం కు వస్తున్న తరుణంలో కలిసేందుకు అవకాశం లేదని సీఎంవో నుంచి సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే కార్యక్రమం వాయిదా పడినట్లు సమాచారం.
పవన్ కళ్యాణ్ హెచ్చరికలతో
ఇటీవల జరిగిన పరిణామాల గురించి అందరికీ తెలిసిందే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) కార్యాలయం నుంచి సినీ పరిశ్రమ ప్రముఖుల వ్యవహార శైలిపై ఘాటైన లేఖ విడుదలైంది. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం జూన్ 12న విడుదల కావాల్సి ఉంది. కానీ కొందరు సినీ పెద్దలతో పాటు ఎగ్జిబిటర్లు సమావేశమై జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ చేపట్టడానికి నిర్ణయించారు. ఈ వార్త బయటకు రావడంతో పవన్ కళ్యాణ్ సీరియస్ గా స్పందించారు. తెలుగు చిత్ర పరిశ్రమ కోసం తాము పరితపిస్తుంటే.. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనుంచి తామేంటో చూపిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలవకపోవడం ఏమిటని సినీ ప్రముఖులను ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమలో కలకలం రేగింది. ఎవరికి వారు గా స్పందించారు. చివరకు సీఎం చంద్రబాబును కలిసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 18న కలిసేందుకు అపాయింట్మెంట్ కూడా కోరారు. అయితే సీఎం చంద్రబాబును కలిసేందుకు మంత్రి కందుల దుర్గేష్ అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఇప్పుడు సీఎం బిజీగా ఉన్నారని చెప్పి సమావేశాన్ని వాయిదా వేశారు.
Also Read: Jr .NTR : ఎట్టకేలకు చంద్రబాబు దగ్గరకు జూనియర్ ఎన్టీఆర్, దేవర కోసమే తగ్గాడా?
జాబితా కుదింపు
అయితే తెలుగు సినీ పరిశ్రమకు ( Telugu cine industry) చెందిన ప్రముఖులు ఈ విషయంలో వర్గాలుగా విడిపోయినట్లు ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా సామాజిక వర్గాల సమతుల్యం పాటించడం కష్టతరంగా మారింది. సీఎంను కలిసి ఎందుకు ఒక జాబితాను రూపొందించారు. ఆ జాబితాలో ఏకంగా 70 మంది పేర్లు రాశారు. అయితే అంత మంది వెళ్లి కలవడం కుదిరే పని కాదు. అలాగని జాబితాను కుదిస్తే ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. తెలుగు అగ్ర కథానాయకుడు కుటుంబ సభ్యుడు ఈ జాబితాను రూపొందించినట్లు తెలుస్తోంది. దీనిపై అభ్యంతరాలు రావడంతోనే జాబితాను కుదించే పనిలో ఉన్నారు. అందుకే ముఖ్యమంత్రితో సమావేశం వాయిదా పడినట్లు బయట ప్రచారం సాగుతోంది.
Also Read: CM Chandrababu: ఆంధ్రజ్యోతి.. చంద్రబాబుకే ఎదురెళుతోందే?
అప్పట్లో అలా
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిని సినీ ప్రముఖులు కలిశారు. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో పెద్దలంతా కలిసి నాడు టిక్కెట్ల ధర పెంపు విషయంలో వినతులు అందించారు. అయితే అప్పట్లో నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు వంటి వారు గైర్హాజరయ్యారు. వారిని ఆహ్వానించలేదని అప్పట్లో ప్రచారం నడిచింది. దీనిపై బాలకృష్ణ కూడా విభిన్నంగా కామెంట్స్ చేశారు. అయితే మరోసారి ఆ పరిస్థితి తలెత్తకుండా సినీ ప్రముఖులను కలుపుకొని వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈనెల 21న విశాఖలో పర్యటించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రపంచ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొనున్నారు. అది పూర్తయితే కానీ సినీ ప్రముఖుల భేటీపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు. చూడాలి ఏం జరుగుతుందో?