Krishna Sudarshana Chakra Story: హిందూ పురాణం ప్రకారం దేవుళ్ళు కొన్ని ప్రత్యేకమైన ఆయుధాలను కలిగి ఉంటారు. వారు చేసిన కార్యాల వల్ల ఆయుధాలను పొందారు. శివుడికి త్రిశూలం ఆయుధం ఉండగా.. మహావిష్ణువుకి సుదర్శన చక్రం చేతిలో తిరుగుతూ ఉంటుంది. సుదర్శన చక్రం పాపులను హరిస్తూ.. ధర్మాన్ని కాపాడుతూ ఉంటుంది. ఒకసారి సుదర్శన చక్రం విడుదల అయితే శత్రువును నాశనం చేసే వరకు తిరిగి యధాస్థితికి రాదు. శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రాన్ని మొదట కలిగి ఉన్నాడు. ఆ తర్వాత దీనిని పార్వతీదేవికి అప్పగించారు. అనంతరం మహావిష్ణువు అవతారమైన పరశురాముడికి సుదర్శన చక్రం అందింది. చివరికి శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని కలిగి ఉన్నాడు. అయితే ఈ సుదర్శన చక్రం మహావిష్ణువుకు ఎవరు ఇచ్చారు? అది పొందడానికి మహావిష్ణువు ఏం చేశాడు? ఆ పురాణాల్లోకి వెళితే..
దేవతలు పొందే ప్రతి ఆయుధం వెనుక ఒక చరిత్ర.. ఒక కారణం కచ్చితంగా ఉంటుంది. శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం సాధించడానికి కూడా ఒక చరిత్ర ఉంది. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు రాక్షసులను సంహరించడానికి ఆయుధాన్ని కలిగి ఉండాలని కోరుకున్నాడు. ఇందులో భాగంగా మహావిష్ణువు కైలాసానికి వెళ్లి.. శివుడిని పూజించడం ప్రారంభించాడు. వెయ్యి తామర పువ్వులతో శివుడికి పూజ చేస్తూ ఒక్కో తామరానికి.. ఒక్కో పేరు పెడుతూ మహా శివుడిని స్మరించాడు. అయితే అప్పటికే మహావిష్ణువు కోసం శివుడు సుదర్శన చక్రాన్ని తయారు చేశాడు. అది అందించడానికి సమయం కోసం వేచి చూస్తుండగా.. మహావిష్ణువు ఈ కార్యాన్ని మొదలుపెట్టాడు. అయితే శివుడు సుదర్శన చక్రాన్ని పొందడానికి మహావిష్ణువు కు ఒక పరీక్ష పెట్టాడు. మహావిష్ణువు శివుడికి పూజించే వెయ్యి తామర పువ్వుల్లో ఒకదానిని శివుడు దాచి పెట్టాడు. ఆ తామర పువ్వు కనిపించకపోయేసరికి.. మహావిష్ణువు తన కన్నును తీసి తామర మధ్యలో ఉంచేందుకు ప్రయత్నించాడు.తన భక్తికి మిచ్చిన శివుడు వెంటనే సుదర్శన చక్రాన్ని మహావిష్ణువుకు అందించాడు.
Also Read: Radha Ashtami 2024 : అంత ప్రేమించిన రాధను.. ఎందుకు కృష్ణుడు వివాహం చేసుకోలేదు?
అలా మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని పొంది రాక్షసులను సంహరించాడు. మహావిష్ణువు చేతిలో ఉండే సుదర్శన చక్రం ఎంతో శక్తివంతమైనది. ఈ సుదర్శన చక్రం ఎవరి చేతిలో ఉంటే వారు అనుకున్న పనిని సక్రమంగా పూర్తి చేస్తుంది. ముఖ్యంగా రాక్షసులను సంహరించడానికి సుదర్శన చక్రం తన కార్యం నిర్వహిస్తూ ఉంటుంది. సుదర్శన చక్రాన్ని మహావిష్ణువుతో పాటు పార్వతి దేవి మాత్రమే కలిగి ఉన్నారు. ఆ తర్వాత చివరికి ఇది మహావిష్ణువుకి చేరింది. శ్రీకృష్ణుని అవతారంలో సుదర్శన చక్రం ప్రత్యేకమైన గుర్తింపును కలిగి ఉంది. ఈ అవతారంలో శ్రీకృష్ణుడు ఒక్కసారి సుదర్శన చక్రాన్ని వదిలిన తర్వాత దాడి చేయకుండా తిరిగి రాలేదు. న్యాయంతోపాటు ధర్మబద్ధంగా ఉండేందుకు సుదర్శన చక్రం కూడా పనిచేస్తుంది. అందువల్ల దేవుళ్ళతో సమానంగా సుదర్శన చక్రాన్ని పూజిస్తూ ఉంటారు. మహావిష్ణువు ఆలయాల్లో సుదర్శన చక్రంను ప్రత్యేకంగా దర్శించుకుంటారు. అంతేకాకుండా సుదర్శన చక్రం ఆశీస్సులు ఉంటే జీవితంలో శుభలే జరుగుతాయని నమ్ముతారు.