Ambati Rambabu: వైసీపీ నేత మంత్రి అంబటి రాంబాబు పై సత్తనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా కొర్రపాడు వద్ద అంబటి తన సోదరుడు మురళితో కలిసి అరాచకం చేశారు. బారికేడ్లు తోసేసి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వారించిన పోలీసులను కూడా అంటటి నెట్టివేశారు. విధులకు ఆటంకం కలిగించి దాడి చేశారంటూ ఐపీసీ 188, 332, 427 సెక్షన్ల కింద పోలీసులు ఆయనపై కేసు నమోద చేశారు.