Homeఎంటర్టైన్మెంట్Ilayaraja And Vamsi: ఇళయరాజాకు, వంశీకి మధ్య గొడవ ఎందుకు? వంశీ ఎందుకు మ్యూజిక్ డైరెక్టర్...

Ilayaraja And Vamsi: ఇళయరాజాకు, వంశీకి మధ్య గొడవ ఎందుకు? వంశీ ఎందుకు మ్యూజిక్ డైరెక్టర్ గా అవతారమెత్తారు?

సినిమాల సమయంలో ఒకరికి ఒకరు సపోర్టుగా ఉండడం వల్లే తమ మధ్య మంచి స్నేహం ఏర్పడిందని వంశీ తెలిపారు. వీరిద్దరూ కలిసి ట్రావెలింగ్ కూడా బాగా చేస్తూ పరిచయం మరింత పెంచుకున్నారు.

Ilayaraja And Vamsi: ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా డైరెక్టర్ వంశీ కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి. వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాల్లో పాటలు అత్యంత మధురంగా ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు. ఆ పాటలు పెద్ద మ్యూజికల్ హిట్స్ గా నిలుస్తాయి. 1984లో సితార సినిమాతో వీరి కాంబినేషన్ ప్రారంభమైంది. అయితే ఈ కాంబినేషన్ 1992 డిటెక్టివ్ నారద వరకు కూడా చాలా సినిమాల్లో కలిసి పనిచేశారు. ఆ సినిమాలు అన్ని కమర్షియల్ హిట్స్ తో సంబంధం లేకుండా పాటలతో బాగా ఆకట్టుకున్నాయి.

ఇక వంశీ అనే పేరు గుర్తుకు వస్తే ఇళయరాజా కంపోజ్ చేసిన పాటలే అందరికీ గుర్తు వచ్చేవి. వంశీ ప్రతి సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజానే అని భావిస్తారు ప్రేక్షకులు. కానీ కొన్ని రోజుల తర్వాత వీరు కలిసి పనిచేయడం ఆపేశారు. అయితే ఇళయరాజా విడిపోయిన తర్వాత వంశీనే మ్యూజిక్ డైరెక్టర్ గా అవతారమెత్తారు. ఇక ఇళరాజా లాంటి సినిమాలు తన సినిమాలు ఉండాలని భావించి చక్రిని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు. మరి ఇళయరాజా వంశీ సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేయను అని చెప్పడానికి కారణం ఏంటి? అని చాలా మంది ఆలోచించారు.

ఇళయరాజా వంశీ సినిమాలో ఎందుకు పనిచేయడం మానేశారో ఒక ఇంటర్వ్యూలో తెలిపారు వంశీ. ఆయన ప్రకారం, ఇళయరాజా తనని ఓ కుమారుడిగా ఎంతో ఆత్మీయంగా చూసుకునేవాడు. అయితే ఇతర విషయాల్లో మాత్రం కాస్త అహంకారిగా ప్రవర్తించేవారు. వంశీ ఎన్ని ట్యూన్స్ కావాలని అడిగితే అన్ని ట్యూన్స్ వెంటనే కంపోజ్ చేసి ఇచ్చేవారట. మామూలుగా ఇతర డైరెక్టర్ల సినిమాల్లో ఐదు పాటలు ఉంటే ఇళయరాజా కేవలం ఐదు ట్యూన్లే ఇచ్చేవాడట. కానీ వంశీ సినిమాలలోని సింగిల్ సాంగ్ కోసం 100 ట్యూన్లు కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయట.

సినిమాల సమయంలో ఒకరికి ఒకరు సపోర్టుగా ఉండడం వల్లే తమ మధ్య మంచి స్నేహం ఏర్పడిందని వంశీ తెలిపారు. వీరిద్దరూ కలిసి ట్రావెలింగ్ కూడా బాగా చేస్తూ పరిచయం మరింత పెంచుకున్నారు. అయితే ఆ సమయంలో ఒక నిర్మాత ఇళయరాజాతో మ్యూజిక్ చేయించుకొని తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చారట. దాంతో ఈ మాత్రం డబ్బులు నాకెందుకు అని మీరే తీసుకెళ్లండి అని ఇళయరాజా ఆగ్రహించారట. ఆ తర్వాత నిర్మాతల దగ్గర డబ్బుల విషయంలో కచ్చితంగా ఉండాలని అనుకున్నారట.

అదే సమయంలో డైరెక్టర్ వంశీ జోకర్ సినిమా మొదలుపెట్టారట. ఇక ఇళయరాజా జోకర్ సినిమాకు గానూ భారీ రెమ్యూనరేషన్ అడిగాడట. నిర్మాత అంత ఇచ్చుకునే స్థాయిలో లేడని అర్థం చేసుకున్న వంశీ ఇక చేసేది లేక తానే ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. ఈ విధంగా వీరి కాంబోకు బ్రేక్ పడింది. మరోవైపు వంశీ మ్మూజిక్ డైరెక్టర్ అయ్యారు.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Oktelugu Epaper