Salaar : ఆ స్టార్ హీరోతో చేయాల్సిన సలార్ మూవీ ప్రభాస్ తో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే?

ఇక ఈ సినిమాతో సక్సెస్ కొట్టి మరోసారి ప్రభాస్ తన సత్తా చాటడానికి రెఢీ అవుతున్నాడు...

Written By: Gopi, Updated On : December 21, 2023 9:15 pm
Follow us on

Salaar : ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్ సినిమా ప్రస్తుతం మరికొద్ది గంటల్లో రిలీజ్ కి రెడీ అయింది.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో ప్రభాస్ మరో స్థాయికి వెళ్తాడు అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటికే ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో ప్రభాస్ ని ఒక రేంజ్ లో చూపించాడు అంటూ వార్తలయితే వస్తున్నాయి.

ఇక ఇదిలా ఉంటే మొదట ప్రశాంత్ నీల్ ఈ సినిమాని వేరే హీరోతో చేద్దామనుకున్నాడంట ఆ హీరో ఎవరు అంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన సూర్యతో ఈ సినిమా చేయాలని ముందుగా ప్రశాంత్ నీల్ అనుకోని స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్న క్రమంలో అతనికి అనుకోకుండా తన డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఒకరు కి ఈ స్టోరీకి ప్రభాస్ ఐతే బాగుంటాడు అని చెప్పడంతో అతను కూడా ఒక రోజంతా ప్రభాస్ ని స్క్రిప్ట్ లో ఊహించుకున్నాడు.

దాంతో ప్రశాంత్ నీల్ కి ప్రభాస్ కరెక్టుగా ఈ సినిమాకి సెట్ అవుతాడు అనుకోని వెంటనే ప్రభాస్ ని కలిసి ఈ కథ వినిపించాడు దాంతో ప్రభాస్ కూడా ఇతనితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే సలార్ సినిమా సూర్య చేయాల్సింది కానీ ప్రభాస్ చేశాడు అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక దీంతో ప్రశాంత్ నీల్ కూడా ఈ విషయం పైన ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు అయితే సూర్య కూడా ఒక స్టార్ హీరో కావడం వల్ల అతనితో సినిమాలు చేయడానికి చాలా మంది డైరెక్టర్లు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కానీ ప్రభాస్ తో పోల్చుకుంటే సూర్య కటౌట్ గాని, మాస్ రామ్ పేజీ గాని, మార్కెట్ గాని చాలా తక్కువ…

ఇక ఇది ఇలా ఉంటే.. ప్రశాంత్ నీల్ ఈ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు సలార్ కథకు సూర్య అయితే బాగుంటాడు అనుకున్నాడు కానీ మార్కెట్ పరంగా ఆలోచించుకోలేదు.  సూర్య ని కలిసి అతనికి కథ కూడా చెప్పలేదు. జస్ట్  కథని అనుకున్నప్పుడు ఈ కథకి సూర్య అయితే బాగుంటాడు అని అనుకున్నాడే తప్ప సూర్యకి కథ చెప్పలేదు. ఆ తర్వాత పాన్ ఇండియా ప్రకారం దేశవ్యాప్తంగా అందరికీ చేరువయ్యే హీరో ప్రభాస్ కాబట్టి అతడి వద్దకు వెళ్లి డైరెక్ట్ గా  కథ చెప్పాడు. ప్రభాస్ ఓకే చెప్పాడు దాంతో సినిమా పట్టాలెక్కింది. ఇక మరి కొద్దీ గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది…ఇక ఈ సినిమాతో సక్సెస్ కొట్టి మరోసారి ప్రభాస్ తన సత్తా చాటడానికి రెఢీ అవుతున్నాడు…